ఏ రాశుల వారు.. స్నేహితులతో ఎలా ఉంటారు.. ఏం కోరుకుంటారు..?

 ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నా అనే మనిషి అంటూ ఒకరు ఉండాలి. కుటుంబసభ్యులు, బంధువులు అనే వారు మన ఛాయిస్ లేకుండా వచ్చేస్తారు. కానీ స్నేహితులను ఎంచుకునే చాయిస్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. అలా ఎంచుకున్న స్నేహితులను చివరి వరకు నిలుపుకునే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం స్నేహితుల కోసం ఏకంగా ప్రాణాలే ఇస్తారట. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఏ రాశివారికి ఎలాంటి స్నేహితులు ఉంటారో తెలుసుకుందాం.

మేష రాశి : స్నేహంలో ఈ రాశివారు టాప్ లో ఉంటారు. ఈ రాశివారు చాలా బిజీ లైఫ్ స్టైల్ ని గడుపుతూ ఉంటారు. కాని వారు ఎల్లప్పుడూ వారి స్నేహితుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వీరికి సోషల్ సర్కిల్ ఎక్కువ. కానీ చాలా కాలం నుండి వారు కలిగి ఉన్న కొద్దిమంది స్నేహితులను కలిగి ఉంటారు. వారు వారి జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాల గురించి స్నేహం పట్ల చాలా మక్కువ చూపుతారు.

వృషభ రాశి : ఈ రాశివారికి స్నేహితులు ఎక్కువ. స్నేహం కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్నేహితులకు అండగా ఉంటారు. ఎలాంటి సహాయం చేయడానికైనా వెనకాడరు. జీవితంలో స్నేహితులను అస్సలు వదిలిపెట్టరు.

మిథున రాశి: ఒక్కసారి మిథున రాశివారితో స్నేహం చేస్తే... వారు చచ్చినా స్నేహాన్ని వదలరు. వీరితో స్నేహం చాలా బాగుంుటంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటూ.. స్నేహితులను కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతారు.

కర్కాటక రాశి : ఈ రాశివారు తొందరగా ఎవరితోనూ స్నేహం చేయలేరు. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే చాలా సమయం తీసుకుంటారు. ఈ రాశివారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ.. నమ్మకం విషయంలో మాత్రం ఎవరినీ పెద్దగా నమ్మలేరు. అందుకే వీరికి కాస్త స్నేహితులు తక్కువే.

 సింహ రాశి : ఈ రాశివారు కూడా స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ రాశివారితో ఒక్కసారి స్నేహం చేస్తే.. ఎవరూ వదులుకోవాలని అనుకోరు. వీరికి జీవితకాలం స్నేహితులు ఉంటారు. కుటుంబసభ్యులతోపాటు.. స్నేహితులకు విలువ ఇస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు స్నేహం చేయడంలో మరీ దారుణం కాదు కానీ.. వీరికి కూడా కాస్త స్నేహితులు తక్కువనే  చెప్పాలి. ఈ రాశివారి జీవితంలోకి స్నేహితులు వస్తుంటారు.. వెళుతుంటారు. ఎవరితోనూ శాశ్వతంగా ఉండలేరు. ఎంత త్వరగా స్నేహం చేస్తారో.. అంతే త్వరగా వదిలేస్తారు.

తుల రాశి: ఈ రాశివారు స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీరికి స్నేహితుల గ్యాంగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త స్నేహితులను ఏర్పరుచుకుంటారు. అయినా.. ఏ ఒక్క స్నేహితుడిని కూడా కోల్పోరు. ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వారికి ఇచ్చి.. అందరితోనూ స్నేహంగా ఉంటారు.

వృశ్చిక రాశి: వృశ్చికం ఒక మంచి స్నేహితుడిలా అనిపించవచ్చు. కానీ వారు సాధారణంగా మీతో స్నేహం చేయడానికి ఒక కారణం ఉండాలి.ఈ రాశివారు.. ఎవరితో స్నేహం చేస్తే మనకు లాభం కలుగుతుంది అని ఆలోచించి తర్వాత వారితో స్నేహం చేస్తారు. అలా వారి దగ్గర నుంచి ప్రయోజనం పొందాక.. వాళ్లని దూరం పెట్టేస్తారు.

 ధనస్సు రాశి : ఈ రాశి వారికి జీవితాంతం స్నేహితులు అని చెప్పుకోవడానికి పెద్దగా ఎవరూ ఉండరు. ఉన్నంత వరకు స్నేహంగా అయితే ఉంటారు కానీ.. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ షిప్ చేయలేరు

మకర రాశి : ఈ రాశివారు  చాలా కొద్దిమందిని మాత్రమే స్నేహితులుగా ఎంచుకుంటారు. స్నేహితుల ఎంపికలోనూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఉన్న స్నేహితులతో మాత్రం చాలా బాగా ఉంటారు. వారి కోసం ఎల్లప్పుడూ సపోర్టివ్ గా నిలుస్తారు.

కుంభ రాశి : ఈ రాశివారికి కూడా స్నేహితులు చాలా తక్కువ అనే చెప్పాలి. ఒకరిని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరగలేరు. ఎవరినీ పెద్దగా నమ్మలేరు. 

మీన రాశి :  ఈ రాశివారికి అసలు స్నేహితులను ఎలా పెంచుకోవాలని.. ఎలా స్నేహం చేయాలి అనే విషయంలో కూడా పెద్దగా అవగాహన ఉండదు. వీళ్లు చాలా సెన్సిటివ్.. ఎవరు ఏదైనా అంటే తట్టుకోలేరు. అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉంటారు.