వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు

ఈవారం ( నవంబర్​ 24  నుంచి 30 వ తేది వరకు)  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మేష రాశి వారికి  చెందిన వ్యాపార స్తులు అనుకున్న లాభాలు పొందగా..  మిథున రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి సూర్యభగవానుడి ఆశీస్సులు లభించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇక కన్యా రాశికి సమాజంలో మంచి గుర్తింపు లభించే అవకాశం..మకర రాశి వారు ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .


మేషరాశి: జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం మేషరాశి వారు ప్రతి విషయాన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. కొత్త పనులు చేపట్టేందుకు ఇది అనుకూల సమయం.  అయితే ఉద్యోగస్తులు.. సంస్థ మారకుండా ఉంటేనే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  అనుకున్న పనిని సాధిస్తారు.  వ్యాపారస్తులు అనుకున్న లాభాలు పొందుతారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  ఆర్థిక విషయంలో పురోగతి ఉంటుంది. ఐటీ సెక్టార్​ లో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు.. సహోద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. 
.
వృషభం : ఈ వారం అధికంగా శ్రమ పడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.  కష్టే.. ఫలే సూత్రం ప్రకారం..  పట్టుదలతో అనుకున్న పనులు నెరవేరుతాయి. పెండింగ్​ పనులు పూర్తవుతాయి. వృత్తి... వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ఆర్థిక రంగంలో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారు గుడ్ న్యూస్​ వింటారు. 
 
మిధునరాశి : ఈ రాశివారు చేపట్టిన ప్రాజెక్ట్ ల్లో విజయం సాధిస్తారు. వృత్తి.. వ్యాపారం.. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం.  ఉద్యోగస్తులకు పని భారం అధికమవుతుంది. కార్యాలయాల్లో మీపై ఒత్తిడి  పెరిగే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు సామాన్య లాభాలు పొందుతారు.  చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.  అనుకోకుండా కొన్ని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారు వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.  

కర్కాటకం:  ఈ రాశి వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండటం వలన అంతా మంచే జరుగుతుంది.  అయితే.. ఆవేశాన్ని.. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  వారం చివరిలో ఆర్థికంగా పురోభివృద్దితో పాటు సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు లభిస్తాయి.  వృత్తి.. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలు గడించే అవకాశం ఉంది.  పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. 

సింహరాశి:  ఈ వారం సింహరాశి వారు పెద్దల సూచనలు... సలహాలు పాటించాలి.  ప్రతి విషయాన్ని  కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  స్త్రీ వలన అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  అనుకోకుండా ప్రయాణాలు రావడంతో ఖర్చు అధికమవుతుంది.  అయితే అనుకున్న పనులు నెరవేరడంతో సంతోషిస్తారు.  వ్యాపారస్తులకు లాభాలు పెద్దగా రాకపోయినా... నష్టాలు మాత్రం  ఉండవని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. 

కన్య రాశి:  ఈ రాశి వారికి .. ఆర్థికంగా బలపడేందుకు మంచి సమయం. ఉద్యోగస్తులు అధిక సమయం పని చేయాల్సిన పరిస్థితులతో  పాటు.. మంచి గుర్తింపు వచ్చే వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మంచి నిర్ణయాలు తీసుకోవడంతో చాలా ఊరట లభిస్తుంది.  వృత్తి.. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వస్తుంది .. కాని వేతనం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు శ్రమ అధికమవుతుంది.  ఈ రాశివారు ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. 

తులారాశి:  ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  సహోద్యోగులనుంచి ఆశించిన సహకారం అందకపోవచ్చు,  కొత్తగా చేపట్టే పనులను వాయిదా వేసుకోండి.  ఆర్థిక విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.  జీవిత భాగస్వామితో వాదనలు పెట్టుకోవద్దు. ఉద్యోగస్తుల విషయంలో.. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా.. మీ పని మీరు చేసుకోండి.  వారం చివరిలో కొంత ఊరట కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ వారం కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. 


వృశ్చికరాశి:   ఈ రాశి వారికి .... ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  వృత్తి.. వ్యాపార.. ఉద్యోగ రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది.  మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. ప్రేమ... పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఆర్థకంగా పురోభివృద్ది ఉంటుంది.  ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.   విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు,  గతంలో పెండింగ్​ ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వారసత్వపు ఆస్తి లభించే అవకాశం ఉంది. తోబుట్టవుల మధ్య సఖ్యత ఏర్పడి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. 


ధనుస్సు రాశి:   ఈ రాశి వారు ముఖ్యమైన బాధ్యతలను నెరవేరుస్తారు.  మీరు చేసే  పనిలో కొన్ని అడ్డంకులు ఎదురైనా .. చివరికి సాధించడంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మిమ్మలను పొడిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండమని పండితులు సూచిస్తున్నారు.  ఉద్యోగస్తులు  వారం చివరిలో సంతోషకరమైన వార్త వింటారు.  అయితే మీరు చేసే పని పట్ల నిబద్దత కలిగి ఉండండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.  విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి.  షేర్​ మార్కెట్​ లో పెట్టుబడి పెట్టే వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి.

మకరరాశి : ఈ రాశి వారికి సన్నిహిత సంబంధాలు మెరుగుపడతాయి.  ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించండి అంతా మంచే జరుగుతుంది. బంధువులు.. స్నేహితుల మధ్య విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. అయితే గతంలో పెండింగ్​ పనులు కొలిక్కి వస్తాయి.  వారం చివరిలో అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక విషయం సానుకూలంగా ఉంటుంది.  సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిగించే అవకాశం ఉంది.  వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. 

కుంభ రాశి : ఈ రాశి వారు భవిష్యత్​ గురించి ఆందోళన చెందే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​తో పాటు  వేతనం పెరిగే అవకాశం ఉంది .  ఆఫీసులో  ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు.  కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలమైన సమయం.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం.  పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.  వృత్తి పని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది.  అయితే  కుటుంబసభ్యుల నుంచి సరైన సహకాకం లేకపోవడంతో.. ఏదో తెలియని ఆందోళనతో భయపడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

మీనరాశి: ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి.  మీరు మోస పోయేందుకు అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.  మీరు తీసుకునే నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఉద్యోగస్తులు.. తోటి ఉద్యోగులతో  ఎలాంటి వాదన పెట్టుకోవద్దు. వృత్తి,, వ్యాపార రంగాల్లో సామాన్య ఫలితాలుంటాయి.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. వారం చివరిలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. జీవితభాగస్వామి సలహా ప్రకారం నడచుకోండి అంతా మంచే జరుగుతుంది.  ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు సూచిస్తున్నారు.