వారఫలాలు (సౌరమానం) డిసెంబర్ 15 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ శుభ యోగంలో కర్కాటకం, సింహ రాశుల వారికి రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. కన్యా వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.  మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉంటుందో  ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి: ఈ వారం మేషరాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.  వారం మధ్యలో తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  వృత్తి.. వ్యాపార .. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.  వారం చివరిలో కొంత ఆందోళన చెందుతారు.  మిగతా పనులన్నీ చాలా చక్కగా కొనసాగుతాయి.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  ప్పేమ వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.  విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.  కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.  ఎవరికి అప్పు ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు. 

వృషభం:  ఈ రాశి వారికి ( డిసెంబర్ 15 నుంచి 21 వరకు) ఈ వారం  ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమికుల పరిస్థితి చాలా బాగుంది. వారం ప్రారంభంలో మీరు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఏది అవసరమో అది అందుబాటులో ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిపోతారు.  అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేసుకోండి.  ఎదుటి వారితో మాట్లాడేడప్పుడు చాలా జాగ్రత్తగా ఉండంది.  వృత్తి పరంగా విజయాలను అందుకుంటారు.  వ్యాపారస్తులకు ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ లోనే అధిక లాభాలు వస్తాయి.  ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 

మిథున రాశి:  ఈ రాశి  వారికి ఈ వారం కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయి.  ప్రేమ విషయాలు  వాయిదా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.  వారం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా... వారం మధ్యలో అన్ని సమస్యలు తీరుతాయి.  వారం చివరిలో ఆర్థికంగా లాభం పొందుతారు.  వ్యాపారస్తులకు ఈ వారం ... గురువారం తరువాత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.  సహోద్యోగుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులు అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులు ఆచితూచి అడుగులు వేయాలి. కర్కాటక రాశి వారు ఈ వారం ( డిసెంబర్ 15 నుంచి21 వరకు) సమాజంలో గౌరవం పొందుతారు.  వారం చివరిలో కొత్త వస్తువులు కొనుగోలు  చేసే అవకాశం ఉంది, డబ్బు లావాదేవీల్లో ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వొద్దు..

సింహ రాశి:  ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.  దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి  కలసి వస్తుంది.  వారం చివరలో డబ్బు అధికంగా ఖర్చవుతుంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి.  ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  తలనొప్పి కంటినొప్పి వచ్చే అవకాశం.కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టబడి పెట్టే అవకాశం ఉంది.  స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 

కన్యారాశి:  ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి.  గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.  కన్యా రాశి వారు ఈ వారం గుళ్లు... గోపురాలు దర్శిస్తారు.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి.. సంతృప్తికరంగా జీవనం కొనసాగిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి.పెళ్లి సంబంధం చేసేవారు వారం చివరిలో గుడ్ న్యూస్ వింటారు. . .

తుల రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు పూర్తవుతాయి.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  ఆర్థికంగా బాగుంటుంది.  మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు.  ప్రభుత్వ ఉద్యోగస్తులుఅనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు.  వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.ప్రేవైటు సంస్థల్లో పనిచేసే వారి ప్రతిభను గుర్తిస్తారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.  ప్రేమ.. పెళ్లి విషయాలు సానుకూలంగా ఉంటాయి. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారు ఈ వారం కొత్త ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.  బంధువులు.. స్నేహితులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి.  వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.  శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.  ప్రేమ విషయాలను వాయిదా వేసుకోండి. షేర్ మార్కెట్ వారికి కలసి వచ్చే అవకాశం ఉంది.  

ధనుస్సు రాశి:  ఈ రాశి వారు దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు.  పూర్వీకులు దాచిన డబ్బు చేతికి అందడంతో... అప్పుల బాధలు తొలగుతాయి.  ఉద్యోగస్తులు శుభవార్త వింటారు.  అయితే కుటుంబంలో కొన్ని చికాకులు ఆందోళనను కలిగిస్తాయి.   వారం చివరిలో కొంత ఊరట కలుగుతుంది.  వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి.  నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.  

మకర రాశి: ఈ రాశి వారు ఈ వారం (( డిసెంబర్ 15 నుంచి21 వరకు) ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది.  అయితే  వారం చివరిలో ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  వ్యాపార రంగంలో చాలా కొద్దిగా లాభాలుంటాయి. సీజన్ వ్యాపారస్తులకు.. చేతి వృత్తి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  ఎవరితోనూ వాదన పెట్టుకోవద్దు..జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవాలపి పండితులు సూచిస్తున్నారు.  ప్రేమికులు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోండి.  

కుంభరాశి: ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది.  శత్రువులు మిత్రులుగా మారతారు.  కొత్తగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వారం మొదట్లో డబ్బు అధికంగా ఖర్చుఅవుతుంది.  ప్రేమ వ్యవహారాలు వాయిదా వేసుకోండి.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.  కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  వారం మధ్యలో కొద్దిగా ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది.  శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. 

మీన రాశి : ఈ రాశి వారు సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేసుకోగలుగుతారు.  ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  గతంలో ఉన్న ఆస్తుల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.  వారం మధ్యలో భూమి.. ఇల్లు.. వాహనం కొనుగోలు  చేసే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థంగా లాభదాయకంగా ఉంటుంది.  ప్రేమ.. పెళ్లి  విషయాలను వాయిదావేసుకోండి.  ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి.  ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. . .