ధనుస్సు రాశిలోకి సూర్యుడు : డిసెంబర్ 15 నుంచి ఈ 5 రాశుల వారికి దివ్యమైన మంచి యోగం అంట..!

గ్రహాలకు రారాజు సూర్యుడు .. డిసెంబర్ 15న సూర్యగ్రహం రాత్రి 9.56 గంటలకు వృశ్చికం నుంచి  ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. 2025 జనవరి 14 వరకు ధనస్సు రాశిలోనే ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శక్తి, తేజస్సు, వృత్తి, ఆర్థిక విషయాల కారకుడు సూర్యుడు. సూర్య గ్రహ సంచారంలో మార్పు రాశి చక్రాలపై ప్రభావం చూపిస్తుంది. ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం ముఖ్యంగా ఐదు రాశుల వారికి బాగా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ రాశుల వారు వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్న సమయంలో చాలా మేలు జరుగుతుంది. కెరీర్​ పరంగా విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విదేశీ ప్రయాణాలు... విదేశీ వ్యాపారాలు కలసి వస్తాయి. షేర్​ మార్కెట్​ లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలుంటాయి.  

మిథునరాశి: సూర్యుడు.. ధనస్సురాశిలో సంచారం వల్ల మిధున రాశి జాతకులు చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కార్యాలయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.  ఆర్థికంగా పురోగతి ఉంటుంది... తోబుట్టువులతో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు అనుకోకుండా లాభాలు పొందుతారు. ప్రేమ వ్యవహారం ఊహించని మలుపు తిరిగి.. సుఖాంతం అవుతుంది. 

సింహ రాశి:  ఈ రాశి వారికి... ధనస్సురాశిలో సూర్యగ్రహం సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ( డిసెంబర్​ 15 నుంచి 2025 జనవరి 14 వరకు) చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఉద్యోగస్తులకు మంచి ఆఫర్​ వస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కొత్తగా ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో విజయం మీ వెన్నంటే ఉంటుంది.  వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం. దూర ప్రయాణాలు కలసి వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. . 

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలా లాభసాటిగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. సంతోషకరంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సహకారం పూర్తిగా ఉంటుంది.  వ్యాపారం చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి లాభాలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు కెరీర్ పురోగతి కోసం కొత్త అవకాశాలను పొందుతారు. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. 

ధనుస్సు రాశి : ధనస్సురాశిలో సూర్య సంచారం వల్ల ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు అన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది . అదృష్టం మీ వెంటే ఉంటుంది. ధనస్సు రాశి వారు  లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మద్దతు లభిస్తుంది. మీ బాస్ ప్రవర్తన కూడా మీ పట్ల సాఫ్ట్ గా మారవచ్చు. ఇది మీ కెరీర్‌లో పురోగతికి అవకాశం ఇస్తుంది.