2024 Astrology: మీ లక్కీ నంబర్​.. అదృష్ట రంగు తెలుసుకోండి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జీవితంలో వివిధ కీలక అంశాలపై సూచనలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబం, ప్రేమ, పెళ్లి వంటి వాటికి సంబంధించి మార్గనిర్దేశం చేస్తారు. అయితే రాబోయే కొత్త సంవత్సరం 2024లో అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంది.. వారి అదృష్ట సంఖ్య, రంగు ఏమిటో తెలుసుకుందాం.  .. .

మేషరాశి

2024లో మేషరాశి, భాగస్వాములను ఆకర్షిస్తూ విశ్వాసంతో సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది.  రిలేషన్‌షిప్ ప్రాధాన్యతలను అంచనా వేయండి. ముఖ్యమైన అవకాశాన్ని అందుకోండి.  భాగస్వామ్య విలువలు, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం  మారే అవకాశం ఉంది.  విదేశీ పర్యటనకు అవకాశాలున్నాయి.  ప్రేమ వివాహాలు కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9 కాగా... వారి అదృష్ట రంగు ఎరుపు అని పండితులు చెబుతున్నారు.  

వృషభం

2024లో వృషభ రాశివారు  లవ్‌ను ప్రత్యేకతంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ప్రయాణం, విద్య, ఆధ్యాత్మికతలో కొత్త రొమాంటిక్‌ కనెక్షన్ అవకాశాలు అందుకుంటారు. రిలేషన్‌లో ఉన్నవారు ఒక అడుగు ముందుకేస్తారు. కనెక్షన్‌ని మరింతగా పెంచుకోవడానికి, బంధాన్ని బలోపేతం చేయడానికి కలిసి కొత్త యాక్టివిటీస్‌ ప్లాన్ చేయండి.. ఉద్యోగంలో ఉన్నవారు అద్భుతమైన విజయాన్ని సాధించగలరు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ ఆకస్మికంగా కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. పిల్లల కెరీర్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   ఈరాశి వారి  అదృష్ట రంగు: క్రీమ్....అదృష్ట సంఖ్య: 8

మిధునరాశి

సింగిల్‌గా ఉన్న వాళ్లు 2024లో ఊహించని రొమాంటిక్‌ రిలేషన్‌కి ఎంటర్ అవుతారు. రిలేషన్‌లో ఉన్నవాళ్లు, భావోద్వేగ సాన్నిహిత్యంలో మునిగిపోతారు. మనసులో దాచిన కోరికలను పార్ట్నర్‌కు వ్యక్తపరచండి. కొన్ని  అనవసరమైన విషయాలు ఆలోచించి  ఒత్తిడికి లోనవుతారు.  విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్ధికంగా పురోగతి లేకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వీలైనంత వరకు అప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.  వీరి అదృష్ట రంగు: ఆకుపచ్చ... అదృష్ట సంఖ్య: 5

కర్కాటక రాశి

2024లో సామాజిక చైతన్యం లాంటి ఆలోచనలు గల వ్యక్తులతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అభివృద్దితో కూడిన మార్పు వచ్చే అవకాశం ఉంది.  దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయి.  కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కలహాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్ర్త తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  నరాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు,  వీరి అదృష్ట రంగు: బ్రౌన్.... అదృష్ట సంఖ్య: 2

సింహ రాశి

2024లో మీ మనసులోని వ్యక్తితో ప్రేమలో పడతారు. రిలేషన్‌లో ఉన్న వారు, ఆశయం, సాధనపై దృష్టి పెట్టండి. కెరీర్ ఆకాంక్షలను కొనసాగించేటప్పుడు భావోద్వేగ అవసరాలను నిర్లక్ష్యం చేయడం మానుకోండి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది.  విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. వీరి అదృష్ట రంగు: గోల్డెన్... అదృష్ట సంఖ్య: 1

కన్యారాశి

ప్రేమ పరంగా 2024లో బలమైన కనెక్షన్‌ పొందుతారు.   కలసి ప్రయాణాలు చేయండి లేదా బంధాన్ని మరింతగా పెంచుకోవడానికి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఆర్దిక పరయైన విషయాలలో కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి నిర్మాణం, వాహనం కొనుగోలు చేసే అవకాశం కలదు. పిల్లల కోసం కొంత అనవసరంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. పోటీ పరీక్షలు రాసేందుకు ఇది అనుకూలమైన సమయం.  వీరి అదృష్ట రంగు పసుపు... అదృష్ట సంఖ్య: 4

తులారాశి

 తులారాశి వారికి 2024 వ సంవత్సరంలో అదృష్ట రంగు  గ్రే కలర్​.. అదృష్ట సంఖ్య 6...  ఈ రాశివారికి  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  వీరు తొందరగా ఇతరులను ఆకట్టుకుంటారు.  ప్రభుత్వ, ప్రైవేట్​ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు వస్తాయి.  విద్యార్థులకు శుభ ఫలితాలు కలుగుతాయి.  విదేశీ చదువులకు కొంత ఆటంకం కలిగినా... చివరిలో అంతా శుభమే జరుగుతుంది.  ఆర్థిక పరంగా ఎలాంటి  ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

వృశ్చికరాశి

2024 వ సవంత్సరంలో వృశ్చికరాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. క్రియేటివిటీ.. రిలేషన్​ షిప్​ ను పెంచుకుంటారు.  ఈ ఏడాది మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు.  వ్యాపారంలో వచ్చే మార్పులను సమయస్ఫూర్తిగా ఎదుర్కొని ముందుకు సాగుతారు.  విద్య, ఆరోగ్యం విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.  ఆర్ధిక పరంగా ఎలాంటి ఇద్బందులు ఉండవు.  ఈ రాశివారికి 2024 వసంవత్సరంలో అదృష్ట సంఖ్య 2 కాగా.. అదృష్ట రంగు : పీచు కలర్​ 

ధనస్సు రాశి

 2024 వ సంవత్సరంలో ధనస్సు రాశివారు చాలా శుభ వార్తలు వింటారు.  విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి.  తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశి వారు 2024 వ సంవత్సరంలో   ఊహించని ప్రదేశాలలో ప్రేమలో పడతారు. అయితే ఓపెన్ మైండ్‌తో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మీ పిల్లలకు బాగానే ఉంటుంది. వీరి  అదృష్ట రంగు: నారింజ... అదృష్ట సంఖ్య: 6

మకరరాశి

2024లో రొమాంటిక్‌ అవకాశాల కోసం వెతుకుతారు. విహారయాత్రలు చేస్తారు.  ఆ సమయంలో కొంతమంది   ప్రత్యేకమైన వ్యక్తులను కలుస్తారు.  ఈ ఏడాది  మకరరాశివారికి చాలా అద్భుతంగా ఉంది.  ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి.  ఆర్థిక పరంగా ఆశాజనకంగా ఉంటుంది.  ప్రశాంతమైన మనస్సుతో ఉండి మీ పనిని పూర్తి చేసుకుంటారు.  ప్రేమ సంబంధ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి.  మకర రాశి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది, విదేశాలకు వెళ్లాలనే వారి కల కూడా నెరవేరుతుంది.ఈ రాశి వారి అదృష్ట రంగు: తెలుపు... అదృష్ట సంఖ్య: 2

కుంభ రాశి

2024 వసంవత్పరంలో కుంభరాశి వారు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి.  కుటుంబ పరంగా సామరస్య వాతావరణం ఉంటుంది.  కెరీర్​ కు సంబంధించి సానుకూల వార్తలను వింటారు. ఆర్దిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరమని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.  కుంభరాశి వారికి ఈ ఏడాది అదృష్ట రంగు: లేత నీలం.. అదృష్ట సంఖ్య: 8

మీనరాశి

ఈ రాశి వారికి ఈ ఏడాది దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.  కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలుంటాయి,   కష్టపడి పని చేయడంతో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.  ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ఆర్థికపరంగా ఎలాంటి మార్పులు ఉండవు,  ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపాలని పండితులు చెబుతున్నారు.  ముఖ్యంగా కంటి సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రేమ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అదృష్ట రంగు:  మెరూన్... అదృష్ట సంఖ్య: 3