Pushpa 2: పాట్నా, చెన్నై, కొచ్చి.. పుష్ప రాజ్ తెలుగు ఈవెంట్ ఎక్కడంటే?

పాట్నా, చెన్నై, కొచ్చి పుష్ప రాజ్ వైల్డ్ ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇక హైదరాబాద్. ముంబై, బెంగళూరు నగరాలల్లో ఈవెంట్స్  నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఇవాళ (నవంబర్ 29న) జెడబ్ల్యూ మారియట్ సహార్ హోటల్‌లో ప్రత్యేక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే, అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక (Rashmika Mandanna) అక్కడికి వెళ్లారు. వీరిద్దరు రన్ వేపై దిగి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నేడు ముంబైలో జరగబోయే మీడియా చిట్ చాట్ తో మరింత వేడి పుట్టించనున్నారు. 

ఈ క్రమంలో తెలుగు ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు? అసలు తెలుగు ఆడియన్స్ కోసం పుష్ప రాజ్ వస్తాడా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే, తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అది చిన్న చిన్నహోటల్లో కాకుండా భారీగా గ్రౌండ్ ఉండే 'రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, యూసుఫ్ గూడ' ఇలా కొన్నిటిని పరిశీలించారు. అందుకు పోలీసులను పర్మిషన్ కూడా అడిగారు. కానీ, ఇందులో ఏదీ ఫిక్స్ అవ్వలేదు. దాంతో అసలు ఈవెంట్ ఉందా?లేదా అనేది సస్పెన్స్గా మారింది.

ALSO READ | Mokshagna: మోక్షజ్ఞ న్యూలుక్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్

ఈ క్రమంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఆదివారం డిసెంబర్ 1న ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించుకునేలా తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అందుకు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్లో మేకర్స్ ఈవెంట్ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు టాక్ ఉంది. ఇక రిలీజ్ దగ్గర పడుతుంది కనుక ఇదే ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.