Daaku Maharaaj: డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "డాకూ మహారాజ్" (Daaku Maharaaj )సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ చేస్తూ వివరాలు వెల్లడించారు.

డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ గురువారం జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురం శ్రీ నగర్ కాలనీలో జరగనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈ సందర్భంగా  X లో పోస్ట్ చేస్తూ..  "ఈ సంక్రాంతి తుఫానుకు కౌంట్‌డౌన్ అనంతపురంలో ప్రారంభం! .. డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ జనవరి 9న జరగబోతుంది.. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు" అంటూ మేకర్స్ వివరాలు వెల్లడించారు. మరి ఒకే వేదికపై మామ, అల్లుళ్లు ఎంతటి రచ్చ చేస్తారో చూడాలి.

ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో బాలయ్యకి జోడిగా ప్రగ్య జైస్వాల్,  ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ కి పోటీగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో వస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.