వెర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ (R.Madhavan) నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ' హిసాబ్ బరాబర్ '(Hisaab Barabar). అశ్వనీ ధీర్ దర్శకత్వం వహించగా జ్యోతి దేశ్పాండే, శరద్ పటేల్ మరియు శ్రేయాన్షి పటేల్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 26, 2024న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రపంచ ప్రీమియర్గా ప్రదర్శించబడింది.
హిసాబ్ బరాబర్ ఓటీటీ:
క్రైమ్ థ్రిల్లర్ హిసాబ్ బరాబర్ మూవీ నేరుగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా గురువారం (జనవరి 9) సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 2025 జనవరి 24 నుంచి జీ5 (Zee5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుంది. ఓ సాధారణ వ్యక్తి ఓ పెద్ద బ్యాంకులో జరిగే బిలియన్ డాలర్ల స్కామ్ ను ఎలా బయటపెట్టాడన్నదే ప్రధాన అంశంగా తెరకెక్కింది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఇటీవలే లక్కీ భాస్కర్, జీబ్రా మూవీస్ కూడా ఈ సెక్టార్ లోనే వచ్చి దుమ్ములేపేసాయి. ఇపుడు ఈ కొత్త సినిమా ఎలాంటి థ్రిల్లింగ్ కలిగించనుందో చూడాలి మరి.
Jab ek aam aadmi uthta hai, toh system hil jata hai. Fraudsters beware! Ab @actormadhavan karenge Hisaab Barabar! ??₹#HisaabBarabar premieres 24th January, only on #ZEE5.#HisaabBarabarOnZEE5 pic.twitter.com/F4CeFJQQba
— ZEE5 (@ZEE5India) January 9, 2025
హిసాబ్ బరాబర్ కథ:
ఈ మూవీలో హీరో మాధవన్ 'రాధే మోహన్ శర్మ' అనే రైల్వే టీసీ పాత్రలో నటిస్తున్నాడు. తన బ్యాంకు ఖాతాలో ఒక చిన్న సమస్యను గుర్తిస్తాడు. తన బ్యాంకు అకౌంట్లో ఒక చిన్న సమస్యగా పెద్దదిగా మారుతుంది. ఈ బ్యాంకులో ఏదో భారీ ఆర్థిక మోసం జరుగుతుందని గుర్తిస్తాడు. దాన్ని ఎలాగైనా వెలికితీసేలా చేసే ప్రయత్నంలో మిక్కీ మెహతా (నీల్ నితిన్ ముఖేష్) గురించి తెలుస్తోంది. రాధే తన అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలుసుకుని ఏం చేశాడు? దాంతో రాధే మోహన్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు మొదలయ్యాయి? చివరికి బ్యాంకింగ్ సెక్టార్ లో రాధే మోహన్ అతిపెద్ద ఆర్థిక కుంభకోణాన్ని ఎలా వెలికితీసాడు అనేది కథ.
ALSO READ | Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..