SSMB 29.. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వరల్డ్ మోస్ట్ ప్రెస్టిజియస్ సినిమా. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ నుంచి మొన్నటి సీక్రెట్ పూజా వరకు అంత గప్ చుప్ గానే ముందుకెళ్తోంది. జనవరి 2, 2025 న హైదరాబాద్‌లో అధికారికంగా లాంచ్ అయినప్పటికీ ఎక్కడ ఫొటోస్ బయటికి రాలేదు. దాంతో పూజ పూర్తయిన వారంలోపు విజయవాడ దగ్గర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో మహేష్ సెట్లో పాల్గొన్నట్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో SSMB 29 షూటింగ్ కి సంబంధించిన ఫోటో అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మహేష్ పాల్గొన్నది SSMB 29 సినిమా సెట్ లోనిది కాదట. ఇది మహేష్ బాబు ట్రూ జోన్ సోలార్ (Truzon Solar) అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న యాడ్ షూట్ అట.
ప్రస్తుతం ట్రూ జోన్ సోలార్కి సంబందించిన యాడ్ షూట్లో మహేష్ తో పాటు మిల్కి బ్యూటీ తమన్నా కూడా పాల్గొంది. దీంతో ఈ జంట ఆగడు మూవీ తర్వాత ఇప్పుడే కనబడేది. అయితే, SSMB 29 కి సంబంధించిన షూట్ జరుగుతున్న మాట నిజమే. కానీ, చాలా పగడ్బందీగా షూట్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జక్కన్న స్టేజిపైకి వచ్చి అప్డేట్స్ ఇస్తే తప్ప ఫ్యాన్స్ ఆకలి తీరేలా లేదు.
SSMB 29 విషయానికి వస్తే..
మహేష్ బాబు కెరీర్‌లో ఇది 29వ చిత్రం. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్‌తో పాటు హాలీవుడ్ నటీనటులు,టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారని టాక్.
అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా ఇది ఉండబోతోందని విజయేంద్ర ప్రసాద్ గతంలో చెప్పారు. అందుకు తగ్గట్టే లొకేషన్స్ కోసం ఒడిశా, ఆఫ్రికాలోని అడవులు సహా అనేక ప్రదేశాలలో పర్యటించారు రాజమౌళి. మునుపెన్నడూ కనిపించని న్యూ లుక్‌లో కనిపించనున్న మహేష్ బాబు.. దీనికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.
Superstar @urstrulyMahesh in a latest ad shoot ? #SSMB29 pic.twitter.com/afid2ImtLk
— TWTM™ (@TWTM__) January 8, 2025