రాశిఫలాలు : 2024 మే 19 నుంచి మే 25 వరకు

మేషం : దీర్ఘకాలిక సమస్య అనుకూలంగా పరిష్కారం. వాహనాలు, స్థలాలు కొంటారు. ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందుతుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహయత్నాలు సానుకూలం. మొదటి సంతానం నుంచి కీలక సమాచారం. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో నూతనోత్సాహం, అందరిలో గుర్తింపు. కళాకారులకు కొత్త అవకాశాలు. వారం మధ్యలో ఒప్పందాలు వాయిదా. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. 

వృషభం : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. రాబడి సంతృప్తికరం. ఆకస్మిక ధనలాభాలు. సోదరులు, సోదరీలతో విభేదాల పరిష్కారం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. భాగస్వాముల నుంచి ప్రోత్సాహం. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులు, పరిశోధకులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు.

మిథునం : చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు, గృహం కొంటారు. చిరకాల ప్రత్యర్థులను ఆకర్షిస్తారు. ఆదాయం పెరిగే సూచనలు. అప్పుల బాధల నుంచి విముక్తి. సోదరులతో ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు శ్రమ ఫలిస్తుంది. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ప్రయాణాలు.

కర్కాటకం :  ముఖ్యమైన కార్యాలు సమయానికి పూర్తి. కొత్త వ్యక్తుల పరిచయం. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులకు ఊరట. స్థిరాస్తి వివాదాలు తీరే అవకాశం. రాబడి ఆశాజనకం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు. ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన కాలం. వారారంభంలో వృథా ఖర్చులు. స్నేహితులతో విభేదాలు.

సింహం : చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. గృహం, వాహనం కొంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు. కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది. బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతోకాలంగా చికాకు పరుస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. క్రీడాకారులు, పరిశోధకులకు శుభవార్తలు. 

కన్య : ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి. భూ వివాదాల పరిష్కారం. శత్రువులు స్నేహితులుగా మారతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. రావలసిన డబ్బు అందుతుంది. సోదరులతో విభేదాల పరిష్కారం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అన్నింటా విజయమే. వారారంభంలో దూర ప్రయాణాలు.

తుల : ఆలోచనలకు కార్యరూపం. కార్యక్రమాల్లో విజయం. సమాజంలో పలుకుబడి. ప్రముఖులతో ఊహించని పరిచయాలు. జీవితాశయం నెరవేరుతుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న చికాకులు తొలగుతాయి. వాహనాలు కొంటారు. సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారులకు లాభాలు. కొత్త వ్యాపారాలకు ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగులు సత్తా చాటుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు లక్ష్యసాధన. వారారంభంలో నిర్ణయాల్లో మార్పులు. 

వృశ్చికం : నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు కొనసాగిస్తారు. బంధువులతో తగాదాల పరిష్కారం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బందుల నుంచి విముక్తి. వారాంతంలో ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. 

ధనస్సు : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విలువైన సమాచారం రాగలదు. వాహనాలు, భూములు కొంటారు. పేరుకుపోయిన బాకీలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు. కుటుంబసభ్యులు మరింత ప్రేమ చూపుతారు. సమస్యలు చాకచక్యంగా పరిష్కారం. వ్యాపారాల్లో అనుకోని లాభాలు, పెట్టుబడులు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగు తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారారంభంలో దూరప్రయాణాలు.

మకరం : ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలకు కార్యరూపం. ఆదాయం సంతృప్తినిస్తుంది. రెండుమూడువిధాలుగా ధనలబ్ధి. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు తథ్యం. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కుతాయి. కళాకారులు, పరిశోధకులకు అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. 

కుంభం : ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ప్రత్యర్థులు స్నేహితు లవుతారు. ఆదాయ, వ్యయాలు సమానం. అవసరాలకు లోటు ఉండదు. వాహన కొనుగోలు యత్నాలు సానుకూలం. కుటుంబసభ్యులకు తగ్గట్టు ప్రవర్తిస్తారు. వ్యాపారులకు ఉత్సాహం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊరట. వారాంతంలో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

మీనం : చేపట్టిన కార్యాలు కొంత మందగించినా ఎట్టకేలకు పూర్తి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తుల వ్యవహారంలో లబ్ధి. ఇంట్లో ఉత్సాహవంతమైన వాతావరణం. వ్యాపారులకు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో పురోగతి. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు, క్రీడాకారులకు నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఖర్చులు తప్పవు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400