వార ఫలాలు.. 2024 జనవరి 14 నుంచి 20 వరకు

మేషం : పట్టుదలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.  స్థిరాస్తి వివాదాలు మరింత ముదిరే అవకాశాలున్నాయి. ప్రతి నిర్ణయంలోనూ మరింత నిదానం పాటించాలి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. తరచూ ప్రయాణాలు చేస్తారు.  వ్యాపారులు ఆశించిన లాభాలు రాకున్నా వెనుకంజవేయరు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పర్యటనలు మధ్యలో వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. అగ్రిమెంట్లు.

వృషభం : ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్య మైన పనుల్లో విజయం సాధిస్తారు. క్రీడాకారులకు గుర్తింపు వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామిక వేత్తలు లాభపడతారు. వ్యవసాయదారులకు అనుకూలం. ఉద్యోగావకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

మిథునం : అనుకున్న పనులు నిదానం. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. బాధ్యతలు మీదపడినా ఆందోళన చెందక ముందుకు సాగుతారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఒక సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులకు తొందరపడకుండా నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. వారారంభంలోవిందులువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన వ్యక్తుల పరిచయం.

కర్కాటకం : మీపట్ల విధేయత మరింత పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 

సింహం : కీలక నిర్ణయాలకు తగిన సమయమే. ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అందరిలోనూ కీర్తి ప్రతిష్ఠలు దక్కుతాయి. కుటుంబసభ్యులు సైతం మీపై ప్రేమానురాగాలు చూపుతారు. ఆస్తుల వ్యవహారంలో నూతన అగ్రిమెంట్లు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కే ఛాన్స్. ఆరోగ్యపరంగా ఉపశమనం పొందుతారు. అదనపు ఆదాయం సైతం దక్కుతుంది. వ్యాపారులకు లాభాలు మరింత ఊరటనిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు. 

కన్య : అలసట, పనిఒత్తిడుల నుంచి విముక్తి. నూతన విద్యావకాశాలు. ఇంటిలో శుభపరిణామాలు ఉత్సాహాన్నిస్తాయి. నేర్పు, ఓర్పుతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. రాబడి పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరే సమయం.

తుల : ముఖ్య కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది, విదేశీ విద్యావకాశాల కోసం చేసే కృషి ఫలిస్తుంది.  ఆస్తి వ్యవహారాలలో రాజీమార్గం. వ్యాపారులు లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకున్న అవకాశాలు, అయితే శ్రమ పడాల్సివస్తుంది. 

వృశ్చికం : దూరప్రాంతాల నుంచి అనుకూల సమాచారం. రాబడికి లోటు ఉండదు. పనులు పూర్తి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల పరిస్థితులు. కుటుంబపెద్దల సలహాలు స్వీకరిస్తారు. వారసత్వ ఆస్తులు దక్కుతాయి. వ్యాపారులు కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కొంత ఊరట. రాజకీయవేత్తలు, కళాకారులు, ఐటీరంగం వారికి అనూహ్యమైన ఆహ్వానాలు రావచ్చు.  

ధనుస్సు : ఆదాయం ఆశించినంతగా లేకున్నా అవసరాలు తీరతాయి. చాకచక్యం, నేర్పుతో వ్యవహరించాల్సిన సమయం. వివాహ, ఉద్యోగ యత్నాలలో అవాంతరాలు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మంచిది. కొన్ని ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగానే పూర్తి కాగలవు. వ్యాపారులు అనుకున్న లాభాలను పొందలేక నిరాశ చెందుతారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి.  పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారాంతంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి.

మకరం : శ్రేయోభిలాషులు వెన్నంటి ఉండి సాయపడతారు. ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి. పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. ఇంటి నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూలం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు.

కుంభం : ఆత్మవిశ్వాసం, నేర్పుతో సమస్యలు అధిగమిస్తారు.బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు నిదానం. క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వారారంభంలో వస్తులాభాలు. 

మీనం : నూతన పరిచయాలతో ఉత్సాహం. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఇబ్బందులు అధిగమిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. భూవివాదాలు పరిష్కారం. వివాహ, ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. సన్నిహితుల నుంచి మాటసాయం. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు లాభాలు. పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం నుంచి ఉపశమనం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు సత్తా నిరూపించుకుంటారు. 

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400