వార ఫలాలు ( సౌరమానం) ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు

మేషం : పట్టుదలతో సమస్యలని అధిగమిస్తారు. బంధువులు, స్నేహితులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆదాయపరంగా ప్రగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరే సమయం. ఆస్తుల సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో విశేష అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతశ్రేణి పోస్టులు రావచ్చు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు మిశ్రమ ఫలాలు. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి.

వృషభం : ఆశ్చర్యకరమైన సంఘటనలు, విశేషాలు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. విద్యావంతులు, మేధావులు రాణిస్తారు. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు యోగదాయకం. ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలలో నిర్లక్ష్యం వద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.

మిథునం : మీ ఊహలు, అంచనాలు కొన్ని వ్యవహారాల్లో తప్పుతాయి. ఆదాయం నిరాశాజనకంగా ఉన్నా కొంత సొమ్ము అందుతుంది. సన్నిహితులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపర్చుకుంటారు. ఎదుటివారిని నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. వాహనాల వంటి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారులు లక్ష్యాల వైపు సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులకు పూర్వవైభవం.

కర్కాటకం : ఆశయాల సాధనలో ముందంజ. సంఘంలో గుర్తింపు. ధనప్రాప్తికి అవకాశం. నిరుద్యోగులు, విద్యార్థులకు కార్యసిద్ధి. పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తుల పరిచయం. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కే సూచన. వ్యాపారులు సామర్థ్యాన్ని చాటుకుంటారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఊరట కలిగించే సమయం.వారం మధ్యలో నిదానం పాటించడం ఉత్తమం. స్వంత నిర్ణయాలు వద్దు, ఇబ్బందుల పాలవుతారు.

సింహం : పనులు పూర్తి చేసి సమర్థత నిరూపించుకుంటారు. ప్రముఖ వ్యక్తులు అన్ని సమయాల్లో మీకు అండగా నిలుస్తారు. ఆదాయం పెరుగుతుంది. వాహనాల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. శుభకార్యాల సందడి. సోదరులతో వివాదాలు సర్దుబాటు. దీర్ఘకాల సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. అవకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకి వెసులుబాటు కలుగుతుంది. ఉద్యోగులకు సహచరుల నుంచి సహాయసహకారాలు. కళాకారులు, రచయితలు గుర్తింపు.

కన్య : మీ నిర్ణయాలు ప్రశంసలు పొందుతాయి. ఆదాయం పెరుగుతుంది. భూములకు సంబంధించిన వివాదాలు తీరతాయి. ఊహించని టెండర్లు దక్కుతాయి. శత్రువులను దారికి తెచ్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశయాలు నెరవేరే సమయం. భూములు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు అనుకున్న ప్రగతి. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు అప్రయత్నంగా అవకాశాలు.

తుల : అనుకున్న రీతిలో పనులు సాగక నిరాశ చెందుతారు. ప్రతి విషయంలోనూ అప్రమత్తత అవసరం. ఆదాయానికి లోటు వల్ల రుణదాతల ఒత్తిళ్లు. వారం మధ్య నుండి అనుకూల పరిస్థితులు.  ఎటూ తేలకుండా ఉన్న ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తగ్గుతాయి. కళాకారులు ఉత్సాహవంతంగా ముందడుగు వేస్తారు.

వృశ్చికం :  రావలసిన డబ్బు అందక రుణదాతలను ఆశ్రయిస్తారు. ప్రతి నిర్ణయంలోనూ నిదానం పాటించాలి. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యపరమైన చికాకులు. మనోనిబ్బరంతో ముందుకు సాగడం మంచిది. వ్యాపారులకి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలతో సతమతమవుతారు. కళాకారులు, పారిశ్రామికవర్గాలు నిరుత్సాహం చెందుతారు. వారారంభంలో శుభవార్తలు, ముఖ్యమైన చర్చలు సఫలం.

ధనుస్సు : పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలితాన్నిచ్చే సమయం. చేపట్టిన కార్యక్రమాలు ప్రారంభంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాన్వేషణలో కొంత ఫలితం కనిపిస్తుంది. ఆస్తుల వ్యవహారాల్లో వివాదాల పరిష్కారం. ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారాలు మీ అంచనాల మేరకు ఉండవచ్చు. ఉద్యోగులకు  విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు శుభవార్తలు. వారాంతంలో భార్యాభర్తలు, సోదరసోదరీల మధ్య విభేదాలు.

మకరం : ఆదాయానికి లోటు ఉండదు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా విజయవంతం. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. ఆస్తుల విషయంలో అనుకున్న విధంగా ఒప్పందాలు. ఇంటి నిర్మాణాలు, వాహనాల కొనడంలో ఇబ్బందులు తొలగుతాయి. వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో మెరుగైన  పరిస్థితులు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు అనుకోని విధంగా లబ్ధి.

కుంభం : ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆశించిన సాయం అందదు. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు నెలకొని కలత చెందుతారు. ఆస్తుల ఒప్పందాలు వాయిదా. మీ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. వ్యాపారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఉద్యోగులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారాంతంలో ధనలబ్ధి. కీలక నిర్ణయాలు.

మీనం : ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు. నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కొన్ని సమస్యలు, ఇబ్బందులు తీరతాయి. ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాల్లో విశేష ప్రగతి. ఉద్యోగులకు కొంత ఊరట. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు. వారారంభంలో ఆదాయం తగ్గుతుంది. మరింత శ్రమపడితేనే ఫలితం కనిపిస్తుంది.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400