వార ఫలాలు ( సౌరమానం) డిసెంబర్ 24 నుంచి 30 వరకు 

మేషం : మీ జీవితాన్ని మలుపుతిప్పే సంఘటన ఎదురవుతుంది. ఒకరి మాటతీరుతో ఇబ్బందిపడతారు. మౌనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆత్మీయులు, బంధువుల నుండి వచ్చిన పిలుపుతో ప్రయాణాలకు సిద్ధపడతారు. ఆర్థికంగా ఫర్వాలేదు. ఇతరుల విషయాలపై ఆసక్తి. విద్యావకాశాల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు, వివిధ వృత్తుల వారికి కొంత మేర సత్ఫలితాలు. అయితే అవి వారు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడతాయి. ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనసౌఖ్యం.

వృషభం : కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న ఒక సమస్య కొలిక్కి వస్తుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. రాబడి దక్కింది కదా అని ఖర్చులు పెంచుకోవద్దు. తరతమ భేదం లేకుండా సాయం అందిస్తారు. ప్రమాదంలో ఉన్న ఒకరికి రక్తదానం చేస్తారు. వారంలో ఎక్కువ భాగం ప్రయాణాలకే వెచ్చిస్తారు. వృత్తులు, వ్యాపారాలు, పారిశ్రామికవేత్తల కృషి సత్ఫలితాలు ఇస్తుంది. వారారంభంలో కొన్ని సమస్యలు. అలాగే, వివాదాలు రావచ్చు.

మిథునం : ఒక సందర్భంలో మీపై వ్యతిరేకత చూపిన వారే సాయానికి ముందుకొస్తారు. బంధువర్గ సలహాలు, సూచనలు కొంత పరిగణనలోకి తీసుకోండి. స్వశక్తిపై ఆధారపడాలి. కీలక విషయంలో ముఖ్యులతో జరిపిన చర్చలు ఫలప్రదం. రాబడి విషయంలో హెచ్చుతగ్గులు సమం. స్థిరాస్తులు, వివిధ మార్గాలలో పొదుపు చర్యలు పాటిస్తారు. వృత్తులు, వ్యాపారులు, రాజకీయాల్లో ఉన్న వారి చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వారాంతంలో మానసిక సంఘర్షణ. వ్యయ ప్రయాసలు.

కర్కాటకం : కుటుంబసభ్యులు మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఎవరి సాయం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు. మనోనిబ్బరంతో కొన్ని వ్యవహారాలు పూర్తి. ఎవరు కాదన్నా మీమార్గాన్ని వీడరు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాల అంచువరకూ వెళ్లి బయటపడతారు. వాహన, గృహ కొనుగోలుపై చేస్తున్న చర్చలు ఫలిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు, కళాకారులు తమతమ రంగాలలో రాణిస్తారు. వారాంతంలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు.
 
సింహం : కొన్ని కార్యక్రమాలు పూర్తి. జీవనగమ్యాన్ని నిర్ధారించుకుని అడుగులు వేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరై మీకు నచ్చిన వ్యక్తిని కలుసుకుంటారు. నిరుద్యోగుల కృషి, పట్టుదల ఫలిస్తుంది. రాబడి విషయంలో ఆశలు ఫలిస్తాయి. రాదనుకున్న సొమ్ము అందవచ్చు. ఇంటి నిర్మాణాలపై అంచనాకు వస్తారు. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. భూముల క్రయవిక్రయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వృత్తులు, వ్యాపారాలు, పారిశ్రామికవర్గాలకు మేలు జరిగే వీలుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో కొత్త సమస్యలు.

కన్య : ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. రాబడికి ఢోకా ఉండదు. ఎవరి మెప్పుకోసం ఆశపడరు. ఎంచుకున్న కార్యక్రమాలు కష్టమైనా పూర్తిచేసేవరకూ విశ్రమించరు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా. అత్యంత ఆప్తులైన కొందరు వివాదాలకు ఆజ్యం పోసేందుకు యత్నిస్తారు, అప్రమత్తత అవసరం. వృత్తులు, వ్యాపారాలు, రాజకీయవర్గాలకు మునుపటి కంటే కొంత మెరుగైన సమయం. వారారంభంలో వాహనాల విషయంలో జాగ్రత్త. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.

తుల : అనుకున్న కార్యక్రమాలు వెంటనే ప్రారంభిస్తారు. స్వయంగా కొన్ని ఉపాధి మార్గాలు ఎంచుకుంటారు. మీ జీవనం కొనసాగింపులో ఒక మిత్రుని సాయం అందుతుంది. రాబడికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం. వాహనాలు లేదా గృహం కొనాలన్న సంకల్పం వాయిదా. ఏదీ తొందరపడి ఒక నిర్ణయానికి రారు. వృత్తులు, వ్యాపారాలు, సాంకేతిక వర్గాలకు మేధస్సుతో మెరుగైన ఫలితాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యపరమైన చికాకులు.

వృశ్చికం : రికార్డు సృష్టించాలనుకునేందుకు చేసే సాహసకృత్యాలు ఇబ్బందిగా మారవచ్చు. అత్యాశ, నిర్లక్ష్యం వీడాలి. ప్రతి అవసరానికి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. స్థిరాస్తులపై మీకున్న హక్కులు పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అనారోగ్యాలను దరిచేరనీయకుండా జాగ్రత్తలు పాటించాలి. వృత్తులు, వ్యాపారాలు, పారిశ్రామిక వర్గాలపై వివిధ రూపాల్లో భారం. వారాంతంలో శుభవార్తా శ్రవణం. కొద్దిమొత్తంలో ధనలబ్ధి.

ధనుస్సు : చీటికీమాటికీ మిమ్మల్ని ఇబ్బందిపెట్టే వారి నుండి విముక్తి. ఆదాయ మార్గాలు మెరుగుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. ఒక బంధువు ద్వారా ఉపయోగపడే సమాచారం తెలుస్తుంది. ఎంతటి కార్యక్రమాన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు. వ్యాయామం, ఆహార నియమాల ద్వారా ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. ఒకసంఘటన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. వృత్తులు, వ్యాపారాలు, రాజకీయవర్గాలకు లాభసాటి. వారారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని చికాకులు.

మకరం : ఒక సమాచారం మనోవేదన కలిగించే వీలుంది. ఆత్మ విశ్వాసం వీడొద్దు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలించే దిశగా అడుగులు. స్థిరాస్తి విషయంలో కొంతకాలంగా ఉన్న కేసులు కొలిక్కివస్తాయి. మీ జీవిత రహస్యాలను బహిర్గతం చేయొద్దు. మీ బలహీనతలను గుర్తించేందుకు కొందరు ఎదురుచూస్తుంటారు. వాహనసౌఖ్యం. వృత్తులు, వ్యాపారాలు, కళారంగం వారికి ప్రోత్సాహం. వారారంభంలో శుభవర్తమానాలు. ఊహించని ఆహ్వానాలు.

కుంభం : కీర్తిప్రతిష్టలు పెరిగి సమాజంలో గుర్తింపు. ఎంతటి సమస్య అయినా తేలిగ్గా పరిష్కారం. ఆదాయం విషయంలో ఇబ్బంది ఉండదు. కొన్ని స్థిరాస్తులు, వాహనాలు కొనే ప్రయత్నాలు. ఒక బంధువు ద్వారా శుభవార్తలు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆప్తులను సంప్రదించండి. వృత్తులు, వ్యాపారాలు, రాజకీయవర్గాల చిరకాల మనోవాంఛ ఫలిస్తుంది. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.

మీనం :  గతంతో పోలిస్తే రాబడి మెరుగుపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు స్వశక్తితో పూర్తి. ఒక సందర్భంలో భావోద్వేగానికి లోనవుతారు. దూరప్రాంతాల నుండి ఉపయుక్తమైన సమాచారం. స్థిరాస్తులు, షేర్ల వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు. జీవితభాగస్వామితో వివాదం సమసిపోతుంది. వృత్తులు, వ్యాపారాలు, కళారంగం వారికి ప్రోత్సాహం. దైవానుగ్రహం తోడై కొన్ని సమస్యలు అధిగమిస్తారు. వారాంతంలో ఆరోగ్య సమస్యలు. వృధాఖర్చులు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400