వార ఫలాలు ( సౌరమానం) 17. 12.2023 నుంచి 23.12.2023 వరకు

మేషం : కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయవేత్తలకు అనుకున్న పదవులు. వారాంతంలో సోదరులతో కలహాలు. శారీరక రుగ్మతలు.

వృషభం : సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అప్పులు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగవర్గాలు నూతనోత్సాహంతో గడుపుతారు. ప్రమోషన్లు దక్కే ఛాన్స్. పారిశ్రామికవేత్తలకు మెరుగైన అవకాశాలు దక్కుతాయి. 

మిథునం : కార్యక్రమాలలో అవరోధాలు. తరచూ ప్రయాణాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. నిరుద్యోగులకు నిరాశ. కొత్తగా అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. వారారంభంలో నూతన పరిచయాలు. విందువినోదాలు.

కర్కాటకం : దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.  సోదరులతో విభేదాలు. ఆస్తి వివాదాలు. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. చర్చల్లో ప్రతిష్టంభన. వ్యాపారులు పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు అదనపు విధులు గందరగోళంగా ఉంటాయి. పారిశ్రామిక వేత్తలకు అంతగా అనుకూలించదు. వారాంతంలో బంధువుల కలయిక. వస్తులాభాలు.

సింహం : ముఖ్యకార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్టులు చేజారతాయి. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు విస్తరణ చర్యలు ముందుకు సాగవు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి. కళాకారులకు అవకాశాలు చేజారి నిరాశ మిగులుతుంది. వారారంభంలో శుభవార్తలు. వాహనయోగం.

కన్య : కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. పరిస్థితులు అనుకూలం. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పరపతి పెరుగుతుంది. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బాకీలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. భాగస్వామ్య వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు నిరీక్షణ ఫలించే సమయం. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు.

తుల : కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, స్నేహితులతో అకారణ తగాదాలు. తరచూ ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగించవచ్చు. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. పెట్టుబడులు అందక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. కళాకారులకు అంచనాలు తారుమారు. వారాంతంలో శుభవార్తలు. వాహనయోగం.

వృశ్చికం : పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తిచేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. బాకీలు అందుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవేత్తల యత్నాలు ఫలిస్తాయి. వారారంభంలో దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

ధనుస్సు : అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆత్మీయుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. వాహనాలు కొంటారు. పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. కళాకారులకు నూతనోత్సాహం. వారారంభంలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు.

మకరం : ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. విద్యార్థులకు అనుకూలం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు.

కుంభం : కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కృషి ఫలించదు. రాబడి తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. వారాంతంలో శుభవార్తలు. ధనలాభం. వివాదాల పరిష్కారం.

మీనం : బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాలలో తగాదాలు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు చేజారతాయి. రాజకీయవర్గాలకు గందరగోళం. వారం మధ్యలో విందువినోదాలు. కార్యజయం.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు ఫోన్​ : 98852 99400