వార ఫలాలు ( సౌరమానం) జనవరి 7 నుంచి 13 వరకు

మేషం : రాబడి సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ఆసక్తికర సమాచారం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ముఖ్య కార్యాలు విజయవంతం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులతో పాటు భాగస్వాములు లభిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారాంతంలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది.

వృషభం : ముఖ్యమైన కార్యాలు సమయానికి పూర్తి. రాబడి మొదట్లో ఇబ్బంది కలిగించినా క్రమేపీ ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. బంధువుల నుంచి ఆహ్వానాలు. శత్రువులు స్నేహితులుగా మారతారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారులకు ఉత్సాహం. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉత్సాహాన్నిస్తాయి. కళాకారులు, పరిశోధకులకు అప్రయత్న కార్యసిద్ధి. వారాంతంలో  వృథా ఖర్చులు. అనారోగ్యం.

మిథునం : కొత్త కార్యాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక  సమాచారం. బంధువుల సూచనలు పాటిస్తారు. రాబడి సంతృప్తికరం. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉత్సవాలు, వేడుకలకు హాజరవుతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు రావచ్చు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం : కుటుంబంలో శుభకార్యాల నిర్వహణతో  సందడి నెలకొంటుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు విజయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు సకాలంలో పెట్టుబడులు అందుకుంటారు, లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పరిశోధకులు, రాజకీయవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి.

సింహం : రాబడి అనుకూలించి అవసరాలు తీరతాయి. ముఖ్య కార్యాలలో అవరోధాలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని  ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తి అగ్రిమెంట్లు చేసుకుంటారు. తల్లి తరఫు నుంచి ధనలాభ సూచనలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు కొత్త భాగస్వాముల నుంచి పెట్టుబడులు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళాకారులు, సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహం.

కన్య : పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు పరిష్కారం. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్య కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి.  ఆదాయం ఆశాజనకం. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సానుకూలమైన కాలం. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. వారాంతంలో  ఖర్చులు. బంధువిరోధాలు.

తుల : ఈ వారమంతా అనుకూలమే. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ముఖ్య కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి స్నేహితులు సహాయపడతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. గృహయోగం. వ్యాపారులు పెట్టుబడులు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు.

వృశ్చికం : శ్రేయోభిలాషుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది. పదిమందిలోనూ గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 

ధనుస్సు : చేపట్టిన కార్యాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆదాయం ఆశాజనకం. కొన్ని అప్పులు తీరతాయి. విద్యార్థులు సత్తా,  ప్రతిభను చాటుకుంటారు. బంధువులతో సఖ్యత. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. చేజారిన వస్తువులు దక్కుతాయి. కుటుంబసమస్యలు చాకచక్యంగా పరిష్కారం. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలలో మార్పులు.

మకరం : కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కొద్దిపాటి శారీరక రుగ్మతలు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ అభిప్రాయాలను అంతా గౌరవిస్తారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు. అనుకున్న రాబడి దక్కుతుంది. బాకీలు వసూలవుతాయి. చేపట్టిన కార్యాలు విజయవంతం. కుటుంబంలో సందడి వాతావరణం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే సమయం. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలకు అనుకూలం.

కుంభం : ఇబ్బందులు, సమస్యలను నేర్పుగా అధిగమించి ముందుకు సాగుతారు. ఆదాయానికి లోటు ఉండదు. కొన్ని వివాదాల పరిష్కారం. ముఖ్యమైన కార్యాలు సజావుగానే సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు,స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కే ఛాన్స్. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మీనం : ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకున్న కార్యాలలో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. స్థిరాస్తి విషయంలో చికాకులు. సోదరుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త. వ్యాపారులకు కొంత ఇబ్బందికరమైనా స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధులు కత్తిమీద సాముగా మారవచ్చు. పరిశోధకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు కొత్త  సమస్యలు. వారం మధ్యలో వాహనయోగం. ధనలబ్ధి.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400