VikrantMassey: సబర్మతి రిపోర్ట్ ట్రైలర్ రిలీజ్.. గోద్రా ఘటనపై విక్రాంత్ మాస్సే ఇన్వెస్టిగేషన్ మూవీ

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్‌‌ మస్సే(Vikrant Massey) సుపరిచితం. ట్వల్త్‌‌ ఫెయిల్‌‌ లోని విక్రాంత్‌‌ నటనకు, తన హవాభాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్‌‌ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్. 

ప్రస్తుతం హీరో విక్రాంత్‌‌ మస్సే హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌‌’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్స్. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా రంజన్‌‌ చందేల్‌‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏక్తాకపూర్ నిర్మాత. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. 

ఈ నేపథ్యంలో ఇవాళ గురువారం (నవంబర్ 7న) ‘ది సబర్మతి రిపోర్ట్‌‌’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2002 ఫిబ్రవరి 27 ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు దహనం ఇన్సిడెంట్‌‌ లో.. నిజంగా ఏం జరిగిందనే వాస్తవాలను చూపిస్తూ సాగిన ట్రైలర్ ఆలోచింపజేస్తోంది.

ఇంగ్లీష్ మీడియాలో చూపించే కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో పోరాడుతూ కనిపిస్తున్నారు. ట్రైలర్ చివర్లో రైలుపై దాడి జరుగుతున్నట్లు, ట్రైన్ తగలబడుతున్నట్లు చూపించే సన్నివేశాలు.. ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ది సబర్మతి రిపోర్ట్ మూవీలో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిధి డోగ్రా ఇన్వెస్టిగేటివ్‌‌ జర్నలిస్టులుగా వారి నటనతో అంచనాలు పెంచేశారు. ఇపుడు రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. కాగా ఈ మూవీ నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదల కానుంది.