నితిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన 'మహారాజ ' (Maharaja) మూవీ ఇండియాలో 2024 జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చైనాలో మహారాజా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
బాక్సాఫీస్ వద్ద రూ.110 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. శుక్రవారం (నవంబర్ 29, 2024న) చైనాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఇవాళ నవంబర్ 28న చైనా థియేటర్స్లో ప్రీమియర్స్ షోలు వేశారు. అక్కడ చాలా మంది చైనా ప్రేక్షకులు విజయ్ సేతుపతి నటనకు ఫిదా అయ్యి.. క్లైమాక్స్ సీన్స్లో భాద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలానైతే తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు ఎమోషన్ అయ్యారో.. ఇపుడు చైనా ఆడియన్స్ కూడా అలానే కనెక్ట్ అవుతుండడం విశేషం.
అంతేకాకుండా.. మహారాజా మూవీ చైనాలో రిలీజ్కు ముందే రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటికే ఈ స్పెషల్ ప్రీమియర్స్ ద్వారానే సుమారు రూ.2.2 కోట్లు వసూలు చేసింది. చైనాలో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' బాక్సాఫీస్ విజయాన్ని ఈ చిత్రం అధిగమిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. రేపు చైనాలోని అన్ని థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతున్న మహారాజా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
#Maharaja ? Preview show Audience Reaction ? in #China ??
— Karthik Ravivarma (@Karthikravivarm) November 25, 2024
pic.twitter.com/DntG0Gz4Y7
ప్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ మరియు నట్టి నటరాజ్ ముఖ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. కాగా విజయ్ సేతుపతి నటించిన 50వ మూవీ మహారాజా కావడం విశేషం.
కాగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ మేకింగ్, రైటింగ్ స్టైల్‌ను సినీ ఆడియన్స్కు బాగా నచ్చాయి. ఈ సినిమా విడుదలయ్యాక తనను ఎంతోమంది ప్రశంసించారు కూడా. కథ పాతదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి నటన వెరసీ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‍ఫ్లిక్స్(Netflix)లోనూ మహారాజ మూవీ దూసుకెళ్తోంది.