చెప్పకనే చెప్పేశారు: గర్ల్‌ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ పోయెటిక్ లైన్స్.. అస్సలు పడనంటున్న రష్మిక

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌‌‌‌లో ఉంది రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఇపుడు పుష్పరాజ్ భార్య శ్రీవల్లీగా తన మేనియని కొనసాగిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇక త్వరలో గర్ల్ ఫ్రెండ్లా మారనుంది. వివరాల్లోకి వెళితే.. 

ప్రస్తుతం రష్మిక చేతిలో దాదాపు  అరడజనుకుపైగా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో తను ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌‌‌‌ కాబోతుంది. 

ఇవాళ సోమవారం (డిసెంబర్ 9న) ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండనే ఈ టీజర్ లాంచ్ చేయడం విశేషం. రష్మిక ట్రెడిష‌న‌ల్ లుక్‌లో అందంగా క‌నిపిస్తోంది. 2000ల కాలం నాటి మెస్మరైజింగ్ లుక్తో త‌ల‌పిస్తోంది.

"నయనం నయనం కలిసే తరుణం.. ఎదనం పరుగే పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.." అంటూ విజయ్ దేవరకొండ పోయెటిక్ వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దాంతో పాటు.. 'విసిరిన నవ్వుల వెలుగుని చూశా.. నవ్వాపితే పగలే చీకటి తెలుసా' అంటూ చెబుతున్న లైన్స్ చాలా ఇంపాక్ట్గా ఉన్నాయి. 'చెప్పకనే చెప్పేశారు.. గర్ల్‌ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్.. అస్సలు పడను అంటూ రష్మిక డైలాగ్' అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ | Amitabh Allu Arjun: పుష్పను పొగిడిన బిగ్ బీ ..ఆనందంలో అల్లు అర్జున్ రియాక్షన్ చూశారా!

అందాల రాక్షసి, చిలసౌ వంటి మూవీస్తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్​ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ రాహుల్ రవీంద్రన్ కావడం విశేషం. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికకు 24వ చిత్రం కాగా..గీతా ఆర్ట్స్51వ చిత్రంగా తెరకెక్కనుంది.

అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై విద్యా కొప్పినీడి,ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.