దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh)..తన పేరుకు ముందే విక్టరీ (VICTORY) అనే ట్యాగ్తో సినిమా ఇండస్ట్రీలో ఒక పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అత్యధిక నంది అవార్డులు అందుకున్న యాక్టర్గా టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా..ఫ్యాన్స్తో పాటు హేటర్స్ కూడా పెరుగుతూ వస్తుంటారు. కానీ, విక్టరీ వెంకటేష్కు మాత్రం జీరో హేటర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే, తన ప్రతి సినిమాతో నవ్వుతూ..నవ్విస్తాడు..ప్రేమతో కవ్విస్తాడు..ఏడుస్తూ ఏడ్పిస్తాడు..అందుకే, సినిమా సినిమాకి అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
వెంకటేష్కి అధ్యాత్మిక చింతన ఎక్కువ. జీసస్, రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి తదితరుల పుస్తకాలు చదివిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ తెలిపారు. అంతేకాకుండా తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేనని పలు వేదికలపై వెంకటేష్ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read : హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాను హీరోగా తెరకెక్కిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ప్రస్తుతం రిలీజ్కి రెడీగా ఉన్న సంక్రాంతికి వస్తున్నాం వరకు తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువయ్యారు.
Happy Birthday Dear @VenkyMama ! Have a wonderful year ahead!! Many Happy Returns!! ??
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2024
ఇవాళ శుక్రవారం డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ బర్త్డే. నేటితో 64వ వసంతంలోకి అడుగుపెట్టాడు వెంకటేష్. ఈ సందర్బంగా ఆయన ఫ్యాన్స్, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Happy birthday to my hero, Victory @venkateshdaggubati garu ???
— Anil Ravipudi (@AnilRavipudi) December 13, 2024
You’re a true legend and a living example of greatness, with an infectious energy that inspires everyone around you ?? Love you always sir ?
Today, we celebrate YOU and the incredible impact you’ve made, Let’s… pic.twitter.com/ufFi6D05B3