MATKA: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. మట్కా వాసు మాస్ షోకి టికెట్స్ ఓపెన్

మట్కా వాసు యొక్క మాస్ షో కోసం ఇప్పుడే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వరుణ్ తేజ్ (Varun Tej) మట్కా (MATKA) మూవీ నవంబర్ 14 న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా (నవంబర్ 11న) బుకింగ్స్ ఓపెన్ చేశారు. 1958-1982 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar) డైరక్ట్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై మరింత హైప్ పెంచేసాయి. మనం ఆశను నమ్ముతం.. నమ్మకాన్ని కొంటాం'.. 'యేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యని కాదు.. బాసుని .. మట్కా కింగ్ ని' అంటూ హీరో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఇంటెన్స్ పెంచుతున్నాయి.

నాలుగు భిన్నమైన షేడ్స్ లో వరుణ్ తేజ్ ఈ సినిమాలో తన యాక్టింగ్ తో కుమ్మేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆలస్యం ఎందుకు ఎపిక్ గ్యాంగ్‌స్టర్ యొక్క ఓల్డెన్ డేస్ యాక్షన్ రైడ్‌ను థ్రిల్ చేయడానికి బుక్ చేసుకోండి. కాగా ఈ మూవీలో వరుణ్ తేజ్కు జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), నోరా ఫతేహి(Nora Fatehi) నటిస్తున్నారు.