Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ రిలీజ్.. దేవర ఎక్కడంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్(Netflix) కు మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతేందుకు.. నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.
 
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా ఓరియెంటెడ్ ఇలా ప్రతో జోనర్ ఇష్టపడే వాళ్లకి మూవీస్ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రతివారం గ్లోబల్, ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది.

ALSO READ | Prabhas Spirit shooting update: 5 నెలలల్లోనే పూర్తి చేస్తారంట..!

లేటెస్ట్గా నెట్‌ ఫ్లిక్స్ ఈ వారం (నవంబర్ 4 నుంచి 10 వరకు) రిలీజైన.. ఇండియన్ టాప్ 10 ట్రేండింగ్ మూవీస్,వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసింది. అందులో ఎన్టీఆర్ దేవర మూవీ టాప్ 1 లో దూసుకెళ్తోంది.  నవంబర్ 8న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ.. కేవలం మూడ్రోజుల్లోనే టాప్ లోకి వచ్చింది. సెకండ్ ప్లేస్లో బాలీవుడ్ మూవీ 'దో పత్తి' ఉండగా.. థర్డ్ ప్లేస్లో 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' ఉంది.

నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్:

1. దేవర

2. దో పత్తి

3. ది బకింగ్‌హామ్ మర్డర్స్

4. మేయళగన్

5. భూల్ భులయ్యా

6. విజయ్ 69

7. ఖేల్ ఖేల్ మే

8. టైమ్ కట్

9. భూల్ భులయ్యా 2

10. ఇట్ ఎండ్స్ విత్ అజ్

టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ లిస్ట్:

1. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో: సీజన్ 2

2. డోన్ట్ కమ్ హోమ్: లిమిటెడ్ సిరీస్

3. మర్డర్ మైండ్‌ఫుల్లీ: సీజన్ 1

4. ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్: సీజన్ 3

5. ది డిప్లొమాట్: సీజన్ 2

6. ది లింకన్ లాయర్: సీజన్ 3

7. ఐసీ 814: ది కాందహార్ హైజాక్: లిమిటెడ్ సిరీస్

8. బ్యాంక్ అండర్ సీజ్: లిమిటెడ్ సిరీస్

9. ఔటర్ బ్యాంక్స్: సీజన్ 4

10. ది డిప్లొమాట్: సీజన్ 1

నెట్‌ఫ్లిక్స్ టాప్ 7 ఒరిజినల్ మూవీస్:

1. మ్యారేజ్ స్టోరీ (ఫ్యామిలీ డ్రామా) - 7.9
2. ది ఐరిష్ మెన్ (గ్యాంగ్‌స్టర్ మూవీ)- 7.9
3. రోమా (డ్రామా) -7.7
4. ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 (హిస్టారియల్ లీగల్ డ్రామా) - 7.7
5.అన్‌కట్ జెమ్స్  (క్రైమ్ థ్రిల్లర్) - 7.4
6. ది కింగ్ (7.3)
7. ద బల్లాడ్ అఫ్ బస్టర్ స్క్రగ్స్ (7.2)