Deepavali Special: చీకటి వెలుగుల కవుల రంగేలీ దీపావళి.. తెలుగు సినిమాల అలనాటి విశేషాలు

తెలుగు సినిమాకు.. దీపావళి (Deepavali) పండుగకు అవినాభావ సంబంధం ఉంది. దీపావళి పేరుతో 1960లో సినిమా వచ్చింది. ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో మెప్పించగా, సావిత్రి సత్యభామగా, కృష్ణకుమారి రుక్మిణిగా నటించారు. దీపావళి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఈ సినిమా సాగుతుంది. 2008లో వేణు, ఆర్తి అగర్వాల్ జంటగా కూడా దీపావళి అనే మరో సినిమా వచ్చింది. దీపావళి పాట పండుగ పూట టీవీల్లో మార్మోగుతూనే ఉంటుంది. 

ఆత్రేయ కలం నుంచి చీకటి వెలుగులు::

పండుగ పూట రేడియోలు, టీవీల్లో మార్మోగే పాట.. చీకటి వెలుగుల రంగేలీ.. జీవితమే ఒక దీపావళి.. ఈ పాట 1972 నాటిది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన విచిత్రబంధం సినిమాలోనిది. ఆత్రేయ రాసిన ఈ పాటకు కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చగా.. ఘంటసాల, పీ సుశీల ఆలపించారు.వీనుల విందుగా సాగే ఈ పాటలో సాహిత్యం ఎంతో ఉంది. మనిషి జీవితానికి.. దీపావళి పండుగకు ఉన్న బంధాన్ని వివరించారు ఆత్రేయ. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. 1972 అక్టోబర్ 12న ఈ సినిమా విడుదలైంది.

@1960 తొలి తెలుగు సినిమా:

దీపావళి పేరుతో వచ్చిన సినిమాల్లో 1960 తొలిసారిగా మూవీ రిలీజైంది. నటసార్వభౌముడు ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో మెప్పించగా, సావిత్రి సత్యభామగా, కృష్ణకుమారి రుక్మిణిగా నటించారు. ఇక స్టార్ నటుడు ఎస్వీ రంగారావు సరకాసురుడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

ఇక కాంతారావు నారదుడిగా, గుమ్మడి నాగదత్తుడుగా, ఎస్. వరలక్ష్మి నరకాసురుడి భార్యగా తమతమ పాత్రలకు ప్రాణం పోసారు. ఇంకా ఎందరో స్టార్ యాక్టర్స్ ఇందులో కనిపించారు. పౌరాణిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ దీపావళి పండుగ ప్రత్యేకత, చరిత్ర తెలిసేలా తెరకెక్కించారు.

@2008 దీపావళి పేరుతో 2008లో మరో మూవీ వచ్చింది. ఎఎఎ క్రియేషన్స్ బ్యానర్ పై తీగల కృష్ణారెడ్డి నిర్మించిన ఈ మూవీకి హరిబాబు డైరెక్షన్ చేశారు. హీరో వేణు, ఆర్తీ అగర్వాల్. మేఘా నాయర్ జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక వందేమాతరం శ్రీనివాస్ చక్కని సంగీతంతో మెప్పించారు. మూవీలో అలీ, అనంత్, భానుచందర్, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు. కొండవలస, చలపతిరావు, బ్రహ్మాజీ తమ కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను కాసేపు నవ్వుకునేలా చేశారు.