Subbaraju Wedding: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?

టాలీవుడ్ యాక్టర్ పెనుమత్స సుబ్బరాజు (Subbaraju) తెలుగు, తమిళ,హిందీ ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. సుమారు 100 చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ విషయానికి వస్తే.. 

నటుడు సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కాబోయే భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను పంచుకున్నారు. పెళ్లి వస్త్రాల్లో కళ్ళకు స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకుని బీచ్ ఒడ్డున పోజ్ ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్, సెలబ్రేటిస్ విషెష్ చెబుతున్నారు.

అయితే, వీరి పెళ్లి సైలెంట్గా ఎలాంటి హడావిడి లేకుండా కేవలం బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. సుబ్బరాజు సతీమణి పేరు, పెళ్లి ఎక్క‌డ జ‌రిగింది? వంటి వివ‌రాలు బయటికి రాలేదు. కాగా వధువుది అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి అని సమాచారం.

Also Read:-ఇలాంటి కేసులకు నేను భయపడా.. AP పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV రియాక్షన్

సుబ్బరాజు పలు సందర్భాల్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదంటూ చెప్పి దాటేసేవాడు. ఇక ఇప్పుడు సడెన్గా వివాహ బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

భీమవరానికి చెందిన సుబ్బరాజు ‘ఖడ్గం’ సినిమాలో చిన్న పాత్రతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్య మూవీతో బెస్ట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకుని ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', భద్ర, సాంబ, పోకిరి, స్టాలిన్, టెంపర్, గీత గోవిందం, బుజ్జిగాడు, బాహుబలి, వాల్తేరు వీరయ్య వంటి పలు స్టార్స్ సినిమాల్లో నటించాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Subba Raju (@actorsubbaraju)