OTT Friday Releases: ఈ శుక్రవారం (Nov8) ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమాలు..వెబ్ సిరీస్లు..అన్నీ తెలుగులోనే!

ఓటీటీ (OTT) ఆడియన్స్కి ఈ శుక్రవారం (నవంబర్ 8) పండుగనే చెప్పుకోవాలి. సహజంగా శుక్రవారం వస్తేనే థియేటర్లో సినిమా పండుగ మొదలవుతుంది. ఇక ఆ రోజు కోసం.. వారం ముందునుంచే టికెట్స్ బుక్ చేసుకుని.. ఫ్రెండ్స్ కూడగట్టుకుని థియేటర్స్కి వచ్చి పేపర్స్ విసురుకుంటూ.. విజిల్స్ వేసుకుంటూ' పండుగ చేసుకుంటాం.

కానీ, ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్కి వెళ్లి చూడాలంటే కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి. అందుకే ఒక మంచి సినిమా ఓటీటీకి వస్తే అందరం కలిసి చూడొచ్చులే అనే థాట్తో ఉన్న ఆడియన్స్కి ఈ శుక్రవారం పండుగే! పెద్ద సినిమాలు వస్తున్నాయి.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ రానున్నాయి. అవేంటో ఒక లుక్కేద్దాం.

సినిమాలు 

దేవర::

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన దేవర (Devara) మూవీ రిలీజైన 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. శుక్రవారం (నవంబర్ 8న) నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి సిద్దమైంది. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై మేకర్స్ నవంబర్ 5న అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.

300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పోటీపడగా చివరికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దాదాపు రూ.155 కోట్లు వెచ్చించి దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం.కాగా ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మూవీగా దేవర రికార్డు క్రియేట్ చేసింది.

వెట్టయన్::

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వెట్టయన్. అక్టోబర్ 10న ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. రూ.160 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా రూ.320 కోట్లు (గ్రాస్)కలెక్ట్ చేసింది. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతోపాటు తెలుగులోనూ వస్తోంది.

ARM ఓటీటీ:

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas)నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'ఆర్మ్' (ARM)‘అజాయంతే రంధం మోషణమ్‌". అంటే తెలుగులో అజయన్ చేసిన రెండో దోపిడీ అని అర్థం. టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా రిలీజైన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటించారు.

డెబ్యుటెంట్ డైరెక్టర్‌ జితిన్‌ లాల్‌ తెరకెక్కించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్‌ సెప్టెంబర్ 12న తెలుగు థియేటర్లలో రిలీజ్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

ఈ సినిమాకు ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ కళకళలాడింది. ఇప్పుడీ ఈ మూవీ ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. శుక్రవారం (నవంబర్ 8) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 

"మూడు తరాలు.. ఒక హీరో. ఈ నవంబర్ 8న ఆర్మ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వస్తోంది. అల్టిమేట్ మలయాళం అడ్వెంచర్ చూడటానికి అందరు సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.

వెబ్ సిరీస్లు

ది బకింగ్‌‌‌‌హమ్ మర్డర్స్::

క్రూ’ తర్వాత కరీనా కపూర్ (Kareena Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ ‘ది బకింగ్‌‌‌‌హమ్ మర్డర్స్'(The Buckingham Murders). హన్సల్ మెహతా (Hansal Mehta) ఈ ఇంటెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు. ఏక్తాకపూర్‌‌‌‌‌‌‌‌, శోభా  కపూర్‌‌‌‌ నిర్మించిన ఈ చిత్రానికి కరీనా కపూర్ కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించింది.

ఇంగ్లాండ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రిమోట్ కమ్యూనిటీలో జరిగిన మర్డర్‌‌‌‌‌‌‌‌ కేసును ఛేదించే డిటెక్టివ్‌‌‌‌ కాప్‌‌‌‌గా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కరీనా కపూర్‌‌‌‌‌‌‌‌ నటించింది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌, ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌ సహా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌‌‌లో ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

ఇకపోతే.. ఈ మూవీ సెప్టెంబర్ 14న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సుమారు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి మూవీ ఇప్పుడు నవంబర్ 8 నుంచి ప్రముఖ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సినిమాకు IMDB లో 7.1/10 రేటింగ్ తో ముందంజలో ఉన్న.. కమర్షియల్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

సిటాడెల్: హనీ బన్నీ::

తెలుగు ప్రముఖ హీరోయిన్ సమంత సిటాడెల్: హనీ బన్నీ (Citadel Honey Bunny) అనే వెబ్ సీరీస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సీరీస్లో బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రాజ్ & డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) తెరకెక్కించారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన డి2ఆర్ ఫిల్మ్స్ మరియు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇటీవలే సిటాడెల్ ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ రేపు గురువారం (నవంబర్ 7) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సిరీస్ కోసం ఆడియన్స్ చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

విజయ్ 69::

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన లేటెస్ట్ మూవీ విజయ్ 69. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.