సుశాంత్ సింగ్ మరణాన్ని ఇప్పటికీ ఎవరూ జీర్ణించు కోలేకపోతున్నారు. అతణ్ని అభిమానించేవారంతా ఇలా ఎలా జరిగింది అంటూ షాక్‌లోనే ఉన్నారు. వారందరూ ఓ కోరిక కోరారు.. సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’ని థియేటర్లో రిలీజ్ చేయమని. ఆ మధ్య శింబు కూడా అదే మాటన్నాడు. చివరి సారిగా తనని బిగ్ స్క్రీన్ పై చూసుకునే అవకాశం ఫ్యాన్స్‌కి ఇవ్వాలని చెప్పాడు. కానీ అది జరిగేలా లేదు. థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జూలై 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘దిల్ బేచారా’ విడుదల కానుంది. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజనా సంఘీ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్ర పోషించాడు. సుశాంత్ కి నివాళిగా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సబ్ స్కైబర్స్, నాన్ సబ్ స్కైబర్స్ కి కూడా ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పిస్తున్నారు.
చివరి సినిమా.. ఓటీటీలో..
- సినిమా రివ్యూస్
- June 26, 2020
మరిన్ని వార్తలు
-
ViduthalaiPart2: విడుదలై పార్ట్ 2 రివ్యూ.. విజయ్ సేతుపతి,వెట్రిమారన్‌ల థ్రిల్లర్ డ్రామా ఎలా ఉందంటే?
-
Bachhala Malli Review: బచ్చల మల్లి మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ విలేజ్ రస్టిక్ డ్రామా ఎలా ఉందంటే?
-
Pushpa 2 Review: పుష్ప2 మూవీ రివ్యూ.. అల్లు అర్జున్, సుకుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
-
Pushpa 2 X Review: ‘పుష్ప 2’ మూవీ X రివ్యూ.. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.