Bachhala Malli Review: బచ్చల మల్లి మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ విలేజ్ రస్టిక్ డ్రామా ఎలా ఉందంటే?

వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బచ్చల మల్లి’(Bachhala Malli). హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ సుబ్బు మంగాదేవి(Subbu) దర్శకుడు. ఇవాళ శుక్రవారం (డిసెంబర్ 20న) బచ్చల మల్లి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

నరేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ (Amritha Aiyer) నటించింది. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్ విజువల్స్తో ఆసక్తి రేపిన అల్లరి నరేష్.. ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకోనున్నారో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే::

1985,1995,2005 అనే మూడు టైమ్‌‌ లైన్స్‌‌లో జరిగే కథ ఇది. బచ్చలమల్లి(అల్లరి నరేష్) బాల్యంలో చదువులో స్టేట్ ర్యాంకర్. చిన్నప్పటి నుంచే అన్ని పనుల్లో చురుకుగా ఉంటాడు. తండ్రి సత్య నారాయణ (బలగం జయరామ్) అంటే అతనికి ప్రాణం. కానీ, కొన్ని కారణాల వల్ల తండ్రిపై వీపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తన తండ్రి తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం తనని ఎంతో వేదనకి గురిచేస్తోంది. దాంతో మల్లి చెడు అలవాట్లకి బానిస అవుతాడు. ఎవ్వరికీ నచ్చని మొరటోడిలా మారిపోతాడు. తినడం, తాగడం, పనికి వెళ్లడం, అడ్డొచ్చిన వాళ్లని తన్నుకుంటూ వెళ్లడం.. ఇదే మల్లిగాడికి ఉన్న ఏకైక దినచర్య అనేలా మారుతుంది.

అలాంటి మల్లి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్) వస్తుంది. అలా అనుకోకుండా తన ప్రేమలో పడిన మల్లి సడెన్ గా వ్యసనాలు వదిలేసి మంచివాడిలా మారతాడు. కానీ, ఒక్కసారిగా మల్లి యధావిధిగా తాగడం మొదలెడతాడు. అలా మారడానికి కారణమేంటీ? ఊళ్లో రాజు (అచ్యుత్ కుమార్) గోని సంచుల వ్యాపారి. అతనికి మల్లికి ఉన్న గొడవేంటీ? వీరిద్దరి మధ్య పోలీస్ అధికారి లక్ష్మీ నారాయణ (రావు రమేష్) పాత్ర ఎలా ఎంట్రీ ఇస్తోంది?

ఒక్కసారిగా గాడిలో పడ్డ జీవితాన్ని మళ్లీ ఏట్లోకి వెళ్లిన మల్లి జీవితం తాలూకు.. ప్రయాణం ఏమైంది? అసలు తన సొంత తండ్రితో కోపం పెంచుకోవడానికి కారణమేంటీ? చివరికి కావేరి ప్రేమను మల్లి సొంతం చేసుకున్నాడా? లేదా? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే బచ్చలమల్లిని థియేటర్స్ లో కలవాల్సిందే.

ఎలా ఉందంటే::

ఈ సినిమాలో బచ్చల మల్లి క్యారెక్టర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. 'అనవసరమైన కోపం, అతి మూర్ఖత్వం'. ఇదే అతని గ్రాఫ్. దీన్నే పాట రూపంలో చెప్పాలంటే.. ‘మరీ అంత కోపం కానే కాదు అలంకారం.. నిజమో అబద్దమో అయినదంటే బతుకు శూన్యం.. అందర్నీ కంది కాలమే.. అమ్మల్లే తానూ సాక్ష్యమే.. అహం ఉన్న దేహం దాటలేదు అంధకారం.. వేదాంతమేమీ లేదు రా.. నీలోని నిన్నే అడగరా.. చరితే ఓ పాఠము.. గతమో గుణపాఠము’ అంటూ ఎమోషనల్‌‌గా సాగిన ఈ ఒక్క పాటలోనే సినిమా మొత్తం ఉంది.

సింపుల్ స్టోరీని సిన్సియర్‌‌‌‌గా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సుబ్బు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌‌తో ఇంప్రెస్ చేసేలా ప్రయత్నం బాగుంది. సినిమా మొదలైన 15 నిమిషాల్లో మల్లి తాగడం, నలుగురిని కొట్టడం చూపిస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అయితే, ఇందులో బచ్చలమల్లి లైఫ్ లో జరిగిన ఓ మూడు సంఘటనల్ని నేపథ్యంగా తీసుకుని.. ఎమోషన్స్, కోపం, ప్రేమ, అవమానం చూపించాడు దర్శకుడు. అయితే, ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ ను ప్రేక్షకులకు కలిగిస్తోంది. ఇదే ఈ సినిమాకు కాస్తా లోటు అని చెప్పుకోవాలి. ప్రేక్షకుడి అంచనాలకు అందనంత సీన్స్ ఉండవు. ఊహకు అందేలానే సాదాసీదాగా సాగుతుంది.

కావేరి రాకతో మొరటుగా ఉన్న మల్లి ఒక్కసారిగా  మారతాడు. అతను మారాక తను చేసిన పాత తప్పులతో సమస్యలు ఎదురవుతాయి. ఫైనల్‌‌గా తను ఏ వైపు టర్న్ అయ్యాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది.  ఏదేమైనా దర్శకుడు సుబ్బు ఫస్ట్ హాఫ్‌ను మరింతగా కొత్తగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అయితే, ఈ కథను 1985,1995,2005 అంటూ చెబుతూ చెప్పిన తీరు, ఆ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఇంటర్వెల్ (ప్రీ క్లైమాక్స్) వచ్చే కొత్త పాత్ర,దాని నేపథ్యం సినిమాకి కీలక మలుపు అని చెప్పుకోవాలి. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సినిమా అదే. పతాక సన్నివేశాల్లో నరేష్ నటన ఆకట్టుకుంటుంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే జీవితంలో కొన్ని నిర్ణయాలు మూర్ఖత్వంతో తీసుకుంటాం. అలా అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ బచ్చల మల్లిది.  

ఎవరెలా చేశారంటే::

అల్లరి నరేష్ బచ్చల మల్లిగా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది. ఎమోషనల్‌‌గా, మొరటుగా చాలా విభిన్నమైన శైలిలో నటించి అదరగొట్టాడు నరేష్. ‘గమ్యం’లో గాలి శీను పాత్ర ఎలా గుర్తుండిపోయిందో ‘బచ్చల మల్లి’ కూడా అలా ఓ పదేళ్ళ పాటు గుర్తుండిపోతాడు.

కావేరిగా అమృత అయ్యర్ చాలా బాగా నటించింది. తనకు మంచి పేరొస్తుంది. అలాగే రావు రమేష్, అచ్యుత్ కుమార్, వైవాహర్ష, హరితేజ, రోహిణి కీలకపాత్రల్లో కనిపించి తమ పాత్రలకు న్యాయం చేశారు. రావు రమేశ్ పాత్ర సినిమాకి కీలకం. మంచి రోల్ దక్కింది.  నటుడు అచ్యుత్ కుమార్ బలమైన విలనిజం చూపించాడు.

సాంకేతిక అంశాలు::

విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. విశాల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డీవోపీ రిచార్డ్ ఎం నాథన్ విజువల్స్ రిఫ్రెషింగ్‌‌గా ఉన్నాయి. గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించాడు.

ఎడిటర్ చోటా కే ప్రసాద్ ఈ సినిమాను గ్రిప్పింగ్‌గా మార్చిడంలో సక్సెస్ అయ్యాడు.. డైరెక్టర్ సుబ్బు మూడు పార్శ్వాలుగా రాసుకున్న కథను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకున్న  స్టోరీని సిన్సియర్‌‌‌‌గా చెప్పాడు. నిర్మాతలు  రాజేష్‌‌, బాలాజీ గుత్తా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.