బ్రేకింగ్: షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కంగారుపడొద్దంటూ ఇన్స్టా పోస్ట్

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి (Suniel Shetty) ఇవాళ గురువారం (నవంబర్ 7న) షూటింగ్లో గాయపడినట్లు సమాచారం. తన లేటెస్ట్  వెబ్ సిరీస్ 'హంటర్' షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. అక్కడ ఆయనపై కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

కాగా ఈ ప్రమాదంలో సునీల్ శెట్టి పక్కటెముకలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. తలకు కూడా స్వల్పంగా దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ ఆపేసి.. వెంటనే హాస్పిటల్కి తరలించగా వ్యైద్యులు ట్రీట్ మెంట్ అందించగా కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే.. సునీల్ శెట్టి హెల్త్ అప్డేట్ ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  

Also Read :ఆ సమంత ఎక్కడ?

దాంతో తన హెల్త్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చేస్తున్న పోస్టులు చూసి.. సునీల్ శెట్టి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించారు. 

"చిన్న గాయం, ఏమీ తీవ్రంగా లేదు! నేను పూర్తిగా బాగున్నాను.. వైద్యుల సహాయంతో నెక్స్ట్ షాట్‌కి సిద్ధంగా ఉన్నాను. అందరి ప్రేమ & ఆదరణకు కృతజ్ఞతలు.." అంటూ శెట్టి పోస్ట్ చేశారు.