కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశం..ఆరు రాశులపై ప్రభావం

ఫిబ్రవరి 14 నుంచి మార్చి నెల 15 వరకు సూర్యుడు ..కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావం వలన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం   ఆరు రాశులవారికి అధికార యోగం పడుతుంది. సామాజికంగా మంచి పరిచయాలతో పాటు పలుకుబడి పెరుగుతుంది. ఆ ఆరు రాశులవారు ఆర్థికంగా లాభం కలగడంతోపాటు ఆస్తికి సంబంధించిన యోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరు రాశుల వివరాలు తెలుసుకుందాం. . . .

మేష రాశి: ఈ రాశి  వారికి ఆదాయం పెరుగుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. పరిచయాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు.  వృత్తి పరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పురోగతి ఉంది.

వృషభ రాశి:  ఈ రాశికి దశమ స్థానంలో సూర్యుడి సంచారంవల్ల పరపతి పెరుగుతుంది. అధికార యోగం పట్టడంతోపాటు వీరి సలహాలు, సూచనలతో పనిచేసే కంపెనీ అభివృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు పెరుగుతాయి. తండ్రి నుంచి ఆస్తి వస్తుంది. ప్రేమ విషయాలు ఫలిస్తాయి. 

మిథున రాశి: చాలా కాలం నుంచి చేస్తున్న  విదేశీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు, ప్రత్యర్థులు వెనకడుగు వేస్తారు. రాజకీయంగా మంచి ప్రాధాన్యం కలుగుతుంది. వృత్తి.. వ్యాపారాల్లో  అనుకోకుండా మార్పులు సంభవిస్తాయి. 

తులా రాశి: ఈ రాశి వారి  ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ధనార్జనకు మార్గాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. శుభపరిణాలు చోటుచేసుకోనున్నాయి. దైవ సంబంధిత కార్యక్రమాలు చేయడం వలన వీరికి ఇప్పటి వరకు ఉన్న నరదృష్టి తొలగిపోయి అన్నీ శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి:  చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఎంతటి పనినైనా సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా మారతాయి. ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.  

మకర రాశి: ఈ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి ఆర్థికంగా లాభపడతారు. ఆస్తుల విలువ పెరగడంతోపాటు రావల్సిన డబ్బు చేతికి అందుతుంది. మాటలకు, చేతలకు విలువ పెరుగుతుంది.