Amaran OTT: అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తమిళ స్టార్ శివ కార్తికేయన్(Siva Karthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) నటించిన మూవీ అమరన్(Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periyaswami) రూపొందించాడు. లోకనాయకుడు కమల్ హాసన్(Kalam Haasan) నిర్మాతగా వ్యవహరించాడు.

ఈ మూవీ దీపావళి కానుకగా పాన్ ఇండియా వైడ్గా రిలీజై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు అమరన్ రూ.320 కోట్లు వసూలు చేసింది. కాగా దీపావళికి ఈ మూవీతో పాటుగా రిలీజైన లక్కీ భాస్కర్, క రెండు నవంబర్ 28న ఓటీటీకి వచ్చి దుమ్మురేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరన్ కూడా వారం ఆలస్యంతో ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చింది.

అమరన్ ఓటీటీ:

గురువారం (డిసెంబరు5) అర్ధరాత్రి నుంచి అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 

Also Read : అల్లు అర్జున్‌, సుకుమార్ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

ఇకపోతే ఈ మూవీ హీరో శివకార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ కలెక్షన్స్తో పాటుగా అమరన్ పలు రికార్డులను నెలకొల్పింది. దీపావళి కానుకగా వచ్చిన 'అమరన్' మూవీ 2024లో రిలీజైన తమిళ్ మూవీస్లో హయ్యెస్ట్ బుకింగ్స్ సాధించిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

2024 లో ఇప్పటి వరకు 4.5 మిలియన్ టికెట్స్ అమ్మకాలతో విజయ్ నటించిన 'ది గోట్' మూవీ టాప్ నిలిచింది. ఇప్పుడు 'అమరన్' ఆ రికార్డును అధిగమించింది. కేవలం మూవీ రిలీజైన 25 రోజుల్లోనే 4.52 మిలియన్స్ టికెట్స్ సేల్స్ టాప్లో నిలిచింది. ఇక ఇపుడు ఓటీటీలో వచ్చిన అమరన్ ఎలాంటి రికార్డ్ నెలకొల్పనుందో చూడాలి.