Ganesh Chaturthi 2024 : సిరిసంపదలకు.. విజయానికి కారకుడు ఎవరో తెలుసా..

విఘ్నాలకు అధిపతి.. గణాలకు అధినేత.. దైవశక్తుల్లో ముఖ్యుడు. పనులు సజావుగా సాగాలంటే గణపతి పూజ చేయాల్సిందే. పైగా ఈ ఆదిదేవుడు సిరిసంపదలకు, విజయాలకు, అభివృద్ధికి కారకుడనే భక్తులకు గట్టి నమ్మకం. ఆ నమ్మకం మన దగ్గరే కాదు.. విదేశీ ప్రజలకు కూడా ఉంది. అందుకే గుళ్లు కట్టి మరీ పూజిస్తున్నారు. విలక్షణ రూపాలతో, మారు పేర్లతో అందరివాడిగా విఘ్నేశుడు ప్రపంచం నలుమూలలా పూజలు అందుకుంటున్నాడు.

ALSO READ | మట్టి గణపతినే ఎందుకు పూజించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

ఇండోనేసియాలో గజా అనే  పేరుతో వినాయకుడు. పూజలు అందుకుంటున్నాడు. అక్కడి ప్రజలు గజానునుడిని  రక్షకుడిగా భావిస్తారు. ఎనిమిదవ శతాబ్దం నుంచే గణనాధుడికి ఇక్కడ ఆలయాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పదిహేను ఆలయాల్లో ఇప్పటికీ ప్రతీరోజు పూజలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా తమ దేవుడికి ఎన్నో రకాలుగా గౌరవం ఇస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇండోనేసియాలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ఐటీబీ(ఐన్దుంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లోగోగా గణేషుడి రూపం ఉంటుంది. అంతేకాదు. కరెన్సీ నోట్ల మీద కూడా గజా రూపాన్ని ముద్రించింది. అక్కడి ప్రభుత్వం.

పాలరాతి విగ్రహం

బాలీ ద్వీపానికి ఈశాన్య దిశగా ఐదు మైళ్ల దూరంలో మెంజంగన్ ఐల్యాండ్ ఉంది. మెంజంగన్ అంటే 'దుప్పి" అని అర్ధం. వసంత రుతువులో దుప్పులు మందలుగా ఈ ద్వీపానికి వస్తుంటాయి. కిలోమీటర్​ పైగా  అవి గుంపులు గుంపులుగా వచ్చే దృశ్యం చూడటానికి బాగుంటుంది. అందుకే స్థానికులు ఈ ద్వీపానికి మెంజంగన్ పేరు పెట్టారు. ఈ ద్వీపంలో సముద్రం ఒడ్డున ఉంది పుర సెగర గిలి ధర్మ కెస్కీనా ఆలయం. ఈ గుడిలో పెద్ద గణేశుడి పూజలు అందుకుంటోంది. ఈ దేవుడు సముద్రం నుంచి అక్కడి దీవులను రక్షిస్తాడని స్థానికుల సమ్మకం. ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండే ఈ గుడిలో ఉచిత 20000 దర్శనం ఉంటుంది.

  • బిల్దార్ రీజియన్ లోని బారా టెంపుల్ (12వ శతాబ్దానికి చెందింది).
  •  రాటు బోకో ఆలయం. ఈ గుడిలో గణేశుడి విగ్రహం అసంపూర్తిగా ఉంటుంది..
  •  ప్రంబనన్ టెంపుల్. దీనికే లోరోజోంగ్లింగ్ అనే మరొక పేరుంది. ఇండోనేసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. (19వ శతాబ్దానికి చెందింది). ఈ శివాలయం కాంప్లెక్స్ లోని వినాయకుడి గుడిలోకి పెళ్లికానీ వాళ్లను మాత్రమే. దర్శనానికి అనుమతిస్తారు.
  •  పెనాతరన్ ఆలయం. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయినా పూజలు మాత్రం జరుగుతున్నాయి. ఈ గుడిని బాగుచేయాలనే డిమాండ్​ తో సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ అయ్యింది. బాలి ద్వీపంలోని పుర బుహుర్ ఉలువాటు   ఆలయం. ఈ గుడి గేట్ దగ్గర గణేశుడి పాత విగ్రహాలు రెండు ఉంటాయి. వీటికి ప్రత్యేక పూజలు జరిపిన తర్వాతే ఆలయంలోని స్థానిక దేవుళ్లకు పూజలు చేస్తారు.
  • బౌద్ధ, హిందూ దేవాలయంగా పేరున్న పుర బ్లానో జోంగ్. బాలిలోని సనుర్ ప్రాంతంలో ఈ గుడి ఉంది. ఈ గుడి కాంప్లెక్స్లో గణేశుడి మండపం 9వ శతాబ్దానికి చెందింది. బ్రాహ్మణులు మాత్రమే ఈ గణేశుడికి పూజలు చేసేందుకు అర్హులు.
  •  సురబయలోని సంగ్గార్ అగుంగ్ టెంపులోని విఘ్నేశుడికి హిందువులు, బౌద్ధులతో పాటు చైనీయులు, లోకల్ కమ్యూనిటీ కెవావెన్ కూడా పూజిస్తారు