Crime Thriller OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

భారీ అంచనాల మధ్య ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కిన జీబ్రా (Zebra) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సత్యదేవ్, డాలీ ధనంజయ లీడ్ రోల్స్‌‌లో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన చిత్రం ‘జీబ్రా' థియేటర్స్ లో రిలీజై మెప్పించింది. ఇపుడీ ఈ మూవీ తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.

జీబ్రా ఓటీటీ:

జీబ్రా మూవీ ఇవాళ బుధవారం (Dec 18)న ఉదయం నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే, ఈ మూవీను చూడాలంటే కండిషన్ పెట్టింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఆహా ఆడియన్స్ అందరూ చూడాలంటే డిసెంబర్ 20 వరకి ఆగాల్సిందే. అయితే, ఇటివలే జీబ్రా ఓటీటీ రిలీజ్ డేట్ 20 అంటూ ప్రకటించగా.. ఆడియన్స్ లో ఉత్సాహం నింపడానికి రెండ్రోజుల ముందుగానే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో జీబ్రా స్ట్రీమింగ్కి అవుతోంది.

Also Read :- ఆస్కార్ నుండి లపతా లేడీస్ ఔట్.. మరో మూవీకి అవకాశం

థ్రిల్లింగ్ రైడ్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ను చూడాలంటే ఆలస్యం ఎందుకు ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని వెంటనే చూసేయండి.ప్రియా భవానీ శంకర్ కీ రోల్లో నటించిన జీబ్రా మూవీని ఎస్‌‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. నవంబర్ 22న థియేటర్స్లో రిలీజై.. నెల రోజులలోపే స్ట్రీమింగ్కి వస్తుండటంతో ఆడియన్స్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

జీబ్రా కథ:

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా,ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌‌‌గా జీబ్రా మూవీని తెరకెక్కించారు. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్‌లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్‌తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌తో ఈ కథని రాసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇటీవలే బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన లక్కీ భాస్కర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే, లక్కీ భాస్కర్ పూర్తిగా పీరియాడిక్ జోనర్లో వచ్చిన కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. దేనికదే డిఫరెంట్ స్టోరీ. 

ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా డిజిటల్ అయింది. అంటే, ఎలాంటి క్రైమ్ అయిన బయట వ్యక్తులు చేసే అవకాశం చాలా తక్కువ. బ్యాంకులో పని చేసే వాళ్లకి తప్పితే కామన్ పీపుల్ కి అక్కడ జరిగే మిస్టేక్స్ తెలీవు. అయితే, ఈ విషయంలో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన అనుభవాన్ని ప్రేక్షకుల అర్ధమయ్యే శైలిలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు.