గోవాలో 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ఈవెంట్ నవంబర్ 20 నుండి 28 వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేదికపై నవంబర్ 21న హీరో రానా దగ్గుబాటి హోస్ట్గా చేస్తోన్న 'ది రానా దగ్గుబాటి షో' (The Rana Daggubati Show) వరల్డ్ ప్రీమియర్ అయింది.
అయితే, ఈ షో నేడు శనివారం (నవంబర్ 23న) ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతేకాదు వరల్డ్ వైడ్గా దాదాపు 240 దేశాల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోండటం విశేషం.
రాం టాక్ షో ఎనిమిది ఎపిసోడ్లతో రానుంది. ఇందులో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు నాని, నాగ చైతన్య, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్, రిషభ్ శెట్టి, ప్రియాంక మోహన్, సిద్ధూ జొన్నలగడ్డ, తేజ సజ్జా, శ్రీలీలతో పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
Also Read : ఓటీటీలోకి సైబర్ థ్రిల్లర్ మెకానిక్ రాఖీ
Pause everything. This episode DEMANDS your attention!?#TheRanaDaggubatiShowOnPrime, new episode every Saturday.
— prime video IN (@PrimeVideoIN) November 22, 2024
Watch Now: https://t.co/jQ4TSqfHVj pic.twitter.com/odGbUZ16wq
ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో హీరో నాని, తేజ సజ్జా, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు. ప్రస్తుతం షో స్ట్రీమింగ్కి వచ్చింది. అయితే విభిన్నమైన అంశాలతో, ఎవ్వరికీ తెలియని ఎన్నో వ్యక్తగతమైన విషయాలను ఈ షోలో సెలబ్రెటీస్ పంచుకోబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. కాగా ఈ షో ప్రతి శనివారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.