సెప్టెంబర్ 27 శుక్రవారం జరిగిన IIFA ఉత్సవం 2024 గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సినీ తారలు. ఈ నేపథ్యంలో నటీమణులు ప్రతిష్టాత్మకంగా భావించే 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' (Woman of the Year in Indian Cinema) అవార్డును స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) అవార్డును గెలుచుకుంది.
ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ స్పీచ్ ఇవ్వగా.. ఈ షోని హోస్ట్ చేస్తున్న రానా, తేజ సజ్జ కొన్ని జోక్స్ వేసి ఆమెను నవ్వించే ప్రయత్నం చేశారు. దాంతో సమంత, రానా మధ్య జరిగిన ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
సమంతా ఈ అవార్డును హీరో విక్కీ కౌశల్ చేతుల మీదుగా అందుకుంది. మాయోసైటిస్ కారణంగా సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న తర్వాత తన రీ ఎంట్రీ గురించి సామ్ ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది. ఇక సామ్ తన స్పీచ్ కంప్లీట్ చేశాక.. రానా తనదైన చమత్కరంతో సమంతపై జోక్స్ వేశాడు.
"సమంత.. ఎక్కడో టాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది.. ఒకప్పుడు నాకు మరదలుగా ఉన్న ఆమె చెల్లి వరకూ వెళ్లింది" అని రానా అనగానే గట్టిగా నవ్వేసిన సామ్.. అంటే సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేస్తున్నావా అని స్పందించింది. ఇప్పుడే ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాను.. జోక్స్ వద్దు అంటూ రానాకు సమంత స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక రానా మరో ప్రశ్న వేస్తూ.. 'తెలుగు సినిమాలు చేయడం లేదు ఎందుకు' అని అడగడంతో.. మీరేమైనా చేస్తున్నారా అని సామ్ ఎదురు ప్రశ్నించింది. ఇక దాంతో నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదంటూ రానా తన చమత్కారంతో బదులిచ్చాడు. తాను ఏదైనా సినిమా చేయాలంటే నరసింహనాయుడులాగా ఉండాలి కానీ రానా నాయుడులాగా ఉండొద్దు కదా అంటూ రానాకు సామ్ గట్టి పంచే ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
Watching this clip on loop?
— Samfangirl? (@HeartNaniSam) November 4, 2024
Kaadhu comedy Sam emaindhi???@Samanthaprabhu2 #IIFAUtsavam2024 #IIFAUtsavamAwards #SamanthaRuthPrabhu? pic.twitter.com/1R3euRWQ4S
అయితే.. సమంత వరసకు రానాకి చెల్లెలు అవుతోంది. ఎలా అంటే.. రానా మేనత్త కొడుకు నాగ చైతన్య అని తెలిసిందే. ఇక వీరిద్దరూ బావబామరిది అవ్వడంతో సమంత చెల్లిగా మారింది. అలా మరొక్క విషయం ఏంటంటే.. 2016లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'బెంగళూరు డేస్' లో రానా, సమంత కలిసి నటించారు. అందుకే 'ఒకప్పుడు నాకు మరదలుగా ఉన్న ఆమె చెల్లి వరకూ వెళ్లింది' అంటూ రానా చమత్కరించాడు.