RC16: చరణ్ నెవ్వర్ బిఫోర్ మాస్ లుక్.. డైరెక్టర్ బుచ్చిబాబు ఫోటో షేర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం మైసూర్ వెళ్లిన చరణ్, బుచ్చిబాబు బృందం మరో క్రేజీ అప్డేట్ పట్టుకొచ్చారు.

రూరల్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా కావడంతో రామ్ చరణ్ అందుకు తగ్గ కసరత్తులు చేసి రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు బాడీని బాగా బిల్డ్ చేసుకున్న చరణ్.. ఇపుడు సరికొత్త మేకోవర్తో కనిపించడానికి సిద్దమయ్యాడు.

Also Read:-RGV ఎక్కడున్నా వదిలేది లేదు.. ఏపీ పోలీసుల గాలింపు ముమ్మరం

లేటెస్ట్గా డైరెక్టర్ బుచ్చిబాబు.. RC16 లో చరణ్ కొత్త లుక్ను ఫేమస్ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్తో డిజైన్ చేయిస్తూ ఫోటో షేర్ చేశాడు. 'సాలిడ్ మేకోవర్ తో రామ్ చరణ్ ఎప్పుడు ముందుంటాడు.. నెవ్వర్ బిఫోర్ మాస్ లుక్ లోడింగ్.. చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో మెగా ఫ్యాన్స్లో చరణ్ లుక్ ఎలా వుండబోతుందనే ఉత్సాహం మొదలైంది.

అయితే.. ఫస్ట్ షెడ్యూల్ చరణ్ సీన్ తోనే స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. ఇందులో RC 16 కీల‌క పాత్ర‌ధారులంతా ఈ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది.

RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.