నటకిరీటి రాజేంద్రప్రసాద్ హరికథ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో(Dec 9న) పుష్ప సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చందనం దొంగ హీరోనా అంటూ.. పుష్ప లోని అల్లు అర్జున్ పాత్రపై రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు ఇపుడు తీవ్ర దుమారం రేపుతోన్నాయి.
"సినిమా ఇండస్ట్రీలో నాది 48 ఏళ్ల నట జీవితం. నటుడిగా నాకు ఇప్పటికీ ‘హరికథ’ లాంటి గొప్ప స్క్రిప్ట్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ నాకు దక్కడం సంతోషంగా ఉంది. అయితే, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు.
ALSO READ : డిసెంబర్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘హరికథ’.. ట్రైలర్ చూశారా..?
నిన్న గాక మొన్న చూసాం. వాడెవడో చందనం దుంగలు దొంగ, వాడు హీరో. సరే హీరోలలో మీనింగ్స్ మారిపోయాయి. 48 సంవత్సరాలుగా ఐ యామ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో అంటూ" రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. దీంతో పుష్పలోని అల్లు అర్జున్ క్యారెక్టర్ పైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే, చందనం దొంగ హీరోనా.. అని ఫ్లోలో అన్నారా లేదంటే కావాలనే అన్నారా అని తెలియాల్సి ఉంది. మరి ఈ తాజా వ్యాఖ్యలు ఎక్కడివరకు వెళతాయో చూడాలి.
మ్యాగీ దర్శకత్వంలో హరికథ వెబ్ సిరీస్ ను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈనెల 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్లో రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రలు పోషించారు.