WildFirePushpa: పుష్ప 2 హిందీ 12 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఏ రోజు ఎంత చేసిందంటే?

పుష్ప 2 ది రూల్ (Pushpa2TheRule).. ఇపుడీ ఈ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే రికార్డ్ కలెక్షన్స్తో రూలింగ్ చేస్తోంది. తెలుగు నేలపై కంటే హిందీ నేలపై బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన ఫస్ట్ డే నుంచి ఇపుడు 12 రోజుల వరకి బాలీవుడ్లో తగ్గేదేలే అన్నట్టుగా వసూళ్లు చేస్తోంది.

తాజాగా మైత్రి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పుష్ప 2 మూవీ 12 రోజుల హయ్యెస్ట్ హిందీ కలెక్షన్స్ తో పాటు గత సినిమాల రికార్డ్స్ బీట్ చేసిందంటూ తెలిపారు. "హిందీలో 2వ సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది.. కేవలం 12 రోజుల్లో  అత్యంత వేగంగా రూ.582 కోట్ల నెట్‌ వసూళ్లు చేసి హిందీ గడ్డపై పుష్ప 2 రికార్డ్" ఇదేనంటూ తెలిపింది.

ALSO READ | Mahesh Babu: ముఫాసాలానే నాన్న కూడా.. అంచనాలు పెంచుతున్న సితార స్పెషల్ వీడియో

ఇక దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 థియేటర్ రన్ ముగిసే లోపు సౌత్ లో రూ.800 కోట్లు చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప 2 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కోవిడ్ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పడివరకు రూ.1414 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక పుష్ప 2 రిలీజైన ఫస్ట్ డే నుంచి 12వ రోజు వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి 

1వ రోజు -75CR

2వ రోజు - 59CR

3వ రోజు - 74CR

4వ రోజు - 86CR

5వ రోజు - 48CR

6వ రోజు - 36CR

7వ రోజు - 31.50CR

8వ రోజు - 27CR

9వ రోజు - 27.50CR

10వ రోజు - 46.50CR

11వ రోజు - 54CR

12వ రోజు - 20.50CR

12 రోజుల టోటల్ హిందీ కలెక్షన్లు రూ.582 కోట్లు.