పుష్ప రాజ్ మాస్ జాతరకు రంగం సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో బీహార్ మొత్తం అభిమానుల ఈలలతో మోగిపోయింది. అక్కడికి వచ్చిన లక్షలమంది ఆడియన్స్ అరుపులతో ఇండియా షేక్ అయ్యే ప్రభంజనం పాట్నా పుట్టించింది.
ఈ నేపథ్యంలో పుష్ప 2 మేకర్స్ మరో గ్రాండ్ ఈవెంట్కి సిద్ధం చేశారు. "మక్కలే, సింగర చెన్నై లా ఓరు స్పెషల్ ఈవెనింగ్ కు సిద్ధంగా ఉన్నారా? నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలో" జరగనుంది అని ట్విట్టర్ X లో వివరాలు వెల్లడించారు. బీహార్ లో భీభత్సం సృష్టించిన అల్లు అర్జున్.. ఇక చెన్నైలో విధ్వంసం పుట్టిస్తాడో చూడాలి.
ALSO READ | Surya45: 19 ఏళ్ల తర్వాత సూర్యతో జతకట్టనున్న త్రిష.. డైరెక్టర్ ఎవరంటే?
పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో.. ఇండియా వైడ్ గ్రాండ్గా ప్రమోషన్స్ చేయనున్నారు. త్వరలో 'తెలుగు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి' రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ పనులు స్టార్ట్ చేశారట. రానున్న ఈ రెండ్రోజుల్లో 'రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియం' లో ఏదో ఒకటి కన్ఫమ్ చేయనున్నారట. ఇక పుష్పాగాడి మాస్ జాతర మోతమోగిపోవాల్సిందే.
Makkale, Singara Chennai la oru special evening ku ready ah? ?
— Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2024
PUSHPA'S WILDFIRE EVENT on November 24th from 5 PM Onwards ❤?
Venue : Leo Muthu Indoor Stadium, Sai Ram Engineering College
ICYM the #Pushpa2TheRuleTrailer
▶️ https://t.co/O9iK3r5lvb#Pushpa2TheRule… pic.twitter.com/J3SN5TSawm