పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory).. ఇపుడు టాలీవుడ్లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లల చేత స్థాపించబడిన ఈ ప్రొడక్షన్ హౌజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాక్ అఫ్ ది టాలీవుడ్గా మారింది.
కార్తికేయ 2, వెంకీ మామ, గూఢచారి, నిశ్శబ్దం, ఓ బేబీ, కుడి ఎడమైతే, న్యూసెన్స్, ధమాకా, రాజా రాజా చోరా, BRO, ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, నరుడి బ్రతుకు నటన, విశ్వం వంటి పలు సినిమాలు చేసింది.
ప్రస్తుతం ప్రభాస్తో రాజా సాబ్, గూఢచారి 2, మిరాయ్, జాట్, కాళీ వంటి సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంది. అయితే.. ఇదిలా ఉంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాల నిర్మాణం మొదలు పెట్టిన తక్కువ సమయంలోనే 50 సినిమాలకు చేరువైంది. తాజాగా కన్నడ స్టార్ హీరో శ్రీమురళితో ఒక సినిమాను అనౌన్స్ చేసింది. ఇంకా ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు.
ALSO READ | WildFirePushpa: పుష్ప 2 హిందీ 12 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఏ రోజు ఎంత చేసిందంటే?
నేడు Dec 17న శ్రీ మురళి పుట్టినరోజు సందర్బంగా ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలు పెంచారు. ఈ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 47 మూవీగా రానుంది. ఈ పోస్టర్ చూస్తుంటే కొత్త ప్రయోగంలా అనిపిస్తోంది. మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఈ బ్యానర్లో ఇంకో 3 సినిమాలైతే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 50 సినిమాల మైలు రాయి చేరనుంది. దీంతో అతి తక్కువ టైంలో 50 సినిమాలు నిర్మించిన ఘనత పొందనుంది ఈ సంస్థ. ఇకపోతే శ్రీ మురళి ఇటీవలే భగీర సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథను అందించాడు. అలాగే పవన్ కళ్యాణ్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా చేయనుందని సమాచారం. అది 50 వ సినిమాగా రాబోతోందా అనేది తెలియాల్సి ఉంది.
People Media Factory joins forces with Roaring Star @SRIMURALIII Garu for our prestigious project #PMF47 ?
— People Media Factory (@peoplemediafcy) December 17, 2024
Wishing @SRIMURALIII Garu a POWERHOUSE year ahead ❤️?#HappyBirthdaySriiMurali ?
Produced by @vishwaprasadtg
This game-changing collaboration is set to redefine cinema… pic.twitter.com/ZtyuuhZ0kJ