Crime Thriller Movies: ఓటీటీలో టాప్ 30 క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్..అస్సలు మిస్సవ్వకండి..ఎక్కడ చూడాలంటే?

OTT క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి అదిరిపోయే టాప్ 20 మూవీస్ ఏంటో ఇపుడు తెలుసుకోండి. ఎందుకంటే, క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఇప్పుడు సజెస్ట్ సినిమాలు చూస్తే ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి సినిమాలు చూడాలంటే భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమిలేదు. ఇలాంటి సినిమాల్లో కథ, క్రైమ్ ఉంటే చాలు. ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారు.సరిగ్గా అలాంటి వారికోసమే రీసెంట్ గా వచ్చిన టాప్ 5 మలయాళ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. 

అబ్రహం ఓజ్లర్

ఈ ఏడాది జనవరి 11న  రిలీజైన మలయాళీ థ్రిల్లర్ అబ్ర‌హం ఓజ్ల‌ర్ (Abraham Ozler). ఈ సినిమాలో మ‌మ్ముట్టి సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కనిపించాడు. దాదాపు రూ.5కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్..బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ‌ట్టింది.

చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ఆడియాన్స్ కు బాగా నచ్చేసింది. అలాగే మార్చి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) లో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో  ఉంది.మరేందుకు ఆలస్యం అబ్రహం ఓజ్లర్ చూసేయండి.

అన్వేషిప్పిన్ కండేతుమ్

మలయాళ సూపర్ స్టార్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్ లో థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయం సాధించింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ ఫుల్లుగా కనెక్ట్ అయ్యారు. 

వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయిన యువతుల హత్య కేసును విచారించించే క్రమంలో ఎస్సై ఆనంద్‌ నారాయణన్‌ (టొవినో థామస్‌) ఎదురైన పరిస్థితులను దర్శకుడు ఉత్కంఠగా చూపించాడు. రూ.8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కూడా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

కన్నూర్ స్క్వాడ్‌

క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని..మ‌మ్ముట్టి కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ 2023లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన..మ‌ల‌యాళ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. అంతే కాకుండా మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఆరో సినిమాగా క‌న్నూర్ స్క్వాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

కర్రీ అండ్ సైనైడ్-ది జూలీ జోసేఫ్ కేస్

కేరళలో జూలీ జోసేఫ్ అనే మహిళ ఆరు హత్యలు చేసిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్.ఆమె ఎలా హత్యలు చేసిందో కర్రీ అండ్ సైనైడ్  తెరకెక్కించారు. ఈ సిరీస్ ఏకంగా 30 దేశాల్లో టాప్ 10 స్థానంలో దూసుకుపోయింది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన నిందితురాలు జూలీపై సోషల్ మీడియాలో మీమ్స్ సైతం వచ్చాయి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

గరుడన్

సురేష్ గోపి మరియు బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గరుడన్. ఇటీవలి కాలంలో మలయాళ ఇండస్ట్రీలో మైండ్‌లెస్ థ్రిల్లర్‌ తో  ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హరీష్ మాధవ్ (సురేష్ గోపి) అనే పోలీసు మరియు ప్రొఫెసర్ అయిన నిశాంత్ (బిజు) మధ్య జరిగిన న్యాయపోరాటం ఈ కథాంశం. వీరిద్దరి మధ్య చిక్కిపోయిన ఓ మర్డర్..ఈ కేసుని ఛేదించే క్రమంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి. 

అంజాం పతిరా(మిడ్ నైట్ మర్డర్స్)

మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన అంజాం పతిరా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సన్ నెక్స్ట్  లో స్ట్రీమింగ్ అవుతుంది. 

కోల్డ్ కేస్

కోల్డ్ కేస్ మూవీని బాలక్ దర్శకత్వం వహించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మేధా పద్మజ (అదితి) పారానార్మల్ మర్డర్ కేసుకు సంబంధించిన రెండు సమాంతర దర్యాప్తులతో ఇంట్రెస్టింగ్ కథనం సాగుతోంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ మూవీస్ అస్సలు మిస్సవ్వొద్దు:

జోసెఫ్ (అమెజాన్ ప్రైమ్)

జోజి  (అమెజాన్ ప్రైమ్)

రోర్‌షాచ్ (డిస్నీ+హాట్‌స్టార్)

ధురువంగల్ పతినారు (ప్రైమ్ వీడియో)

వైరస్ (ప్రైమ్ వీడియో)

CU సూన్ (ప్రైమ్ వీడియో)

మాలిక్ (ప్రైమ్ వీడియో)

విడుదల పార్ట్ 1 (ప్రైమ్ వీడియో)

కిల్ (ప్రైమ్ వీడియో)

రాయన్  (ప్రైమ్ వీడియో)

గోళం  (ప్రైమ్ వీడియో)

సైరన్ (ప్రైమ్ వీడియో)

జనగణమన (నెట్‌ఫ్లిక్స్)

బకింగ్‌హామ్ మర్డర్స్ (నెట్‌ఫ్లిక్స్)

సెక్టార్ 36 (నెట్‌ఫ్లిక్స్)

మహారాజా (నెట్‌ఫ్లిక్స్)

కిల్లర్ సూప్ (నెట్‌ఫ్లిక్స్)

షైతాన్  (నెట్‌ఫ్లిక్స్)

భక్షక్ (నెట్‌ఫ్లిక్స్)

ఇరట్టా - (నెట్‌ఫ్లిక్స్)

హర్షద్ మెహతా స్టోరీ (సోనీ లివ్)

మాన్వత్ మర్డర్స్- క్రైమ్ థ్రిల్లర్ (సోనీ లివ్)

అంతాక్షరి - (సోనిలివ్)

సైలెన్స్ 2 (జీ 5)

రౌతు కా రాజ్ (జీ 5)

భయ్యా జీ (జీ 5)

ఇని ఉత్తరం (జీ 5)

ప్రసన్న వదనం (ఆహా)

మోక్ష ఐలాండ్ మిస్ట‌రీ (హాట్ స్టార్)

దృశ్యం1,2 (డిస్నీ+ + హాట్‌స్టార్)