సినీ ప్రముఖుల జీవితాలపై వరుస డాక్యుమెంటరీస్ వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ రైటర్స్ సలీం జావెద్, దర్శకధీరుడు రాజమౌళి, నయనతార జీవితాలపై డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడీ వరుసలో రోషన్స్ ఫ్యామిలీ చేరింది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్, అంకుల్ రాజేష్ రోషన్, తాతయ్య రోషన్ జీవితాలు, వాళ్ల కెరీర్‌ల చుట్టూ ఇది తిరుగుతుంది. ‘ది రోషన్స్’ పేరుతో దీన్ని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
ఇరవై నాలుగేళ్ల క్రితం తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించిన ‘కహో.. నా ప్యార్ హై’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి ‘వార్ 2’ చిత్రంలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.