స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) ఇవాళ శనివారం (నవంబర్ 16న) దర్శకుడు మరియు నిర్మాత అయిన హీరో ధనుష్ (Dhanush)పై విరుచుకుపడింది. ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా హీరో ధనుష్ కు ఓ 3 పేజీల బహిరంగ లేఖ రాసింది.
నయనతార మరియు తన భర్త విఘ్నేష్ శివన్‌ల 'నానుమ్ రౌడీ' తెలుగులో (నేను రౌడీనే) మూవీని నిర్మించింది హీరో ధనుష్. ఇక నయనతార, విఘ్నేష్ లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'బియాండ్ ది ఫెయిరీటేల్‌లో' ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. ఇకపోతే ఈ డాక్యుమెంటరీలో ఓ మూడు సెకన్ల క్లిప్ వాడటంతో ఈ వివాదం మొదలైంది. అసలు ఏం జరిగిందో.. వీరి మధ్య నెలకొన్న సమస్యలు ఏంటో? వివరాల్లోకి వెళితే..
నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీగా రిలీజ్ చేయానున్నారు. అనేక అడ్డంకులు, సవాళ్లను దాటి ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని చెబుతూ అతడిపై 3 పేజీల లేఖ రాసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అభిమానులకు కనిపించే ధనుష్ వేరు అని.. నిజానికి అసలైన ధనుష్ వేరని.. ఫ్యాన్స్ కు సూక్తులు చెప్పే నువ్వు పాటించవంటూ రేంజ్ లో విరుచుకుపడింది.
Also Read : దిశా పటానీ తండ్రి నుంచి రూ. 25 లక్షలు స్వాహా
నయనతార, విఘ్నేష్ శివన్ ల జీవిత ప్రయాణంలో నేను రౌడీనే సినిమా ఎంతో స్పెషల్. ఈ సినిమాను నిర్మించింది హీరో ధనుష్. ఇక వీరికి ఎంతో స్పెషల్ గా నిలిచిన నేను రౌడీనే సినిమాలోని కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్‌ను వాడుకుంటామని ధనుష్‌ను నయన్ రిక్వెస్ట్ చేసిందట. అందుకు ఈ మూవీలోని సాంగ్స్ ను ఉపయోగించుకోవడానికి ధనుష్ వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దాంతో ధనుష్ ఇవ్వడం లేదు కదా అని నేను రౌడీనే సినిమా టైంలో 'బిహైండ్ ది సీన్స్‌లో' తమ ఫోన్ కెమెరాల్లో తీసుకున్న విజువల్స్‌ని ఓ మూడు సెకన్ల పాటు ఎడిట్ చేసి, రీ షూట్ చేసి ఈ డాక్యుమెంటరీలో (పెళ్లి వీడియో) వాడారట.
అందుకు జస్ట్ 3 సెకన్ల BTS ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని.. ప్రైవేట్‌గా తీసిన సీన్‌కి, ఇప్పటికే వెబ్‌సైట్లలో షేర్ చేసినందుకు పది కోట్లు పరిహారం కోరడం చాలా విచిత్రమని.. ఈ వినయపూర్వకమైన చర్య మీరు ఎలాంటి వ్యక్తి అనేది తెలియజేస్తుంది. మీరు స్టేజ్ పై మాట్లాడే మాటలను మీరు ఒక్కసారి కూడా పాటించరని నాకు, నా భర్తకు తెలుసు. నయనతార లేఖలో వెల్లడించింది.
అలాగే ఈ లేఖలో.. 'ధనుష్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం మాపై చూపిస్తున్న వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం అని తెలిపింది. మీరు ఉద్దేశపూర్వకంగానే ఇంతకాలం ఇలా చేయడం బాధాకరమని.. ఇంకా ముఖ్యముగా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ యొక్క ట్రైలర్ విడుదలైన తర్వాత మీరు నష్టపరిహారం డిమాండ్ చేయడం బాధకలిగించిందని' చెప్పుకొచ్చింది.
ఒక నిర్మాత తన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాన్ని, స్వేచ్ఛను నియంత్రించగలడా? చట్టపరమైన చర్యలను చట్టపరంగా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ‘నానుమ్ రౌడీతాన్’ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు పాటలకు కాపీరైట్ నో హోల్డ్ బ్యార్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను దయచేసి కోర్టుకు వివరించండి" అంటూ సుధీర్ఘ లేఖ విడుదల చేసింది నయన్.
#SpreadLove and Only Love ?? pic.twitter.com/6I1rrPXyOg
— Nayanthara✨ (@NayantharaU) November 16, 2024