నరేష్ అగస్త్య (Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) కీలక పాత్రల్లో నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ 'వికటకవి' (Vikkatakavi). ఈ వెబ్ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఫస్ట్ టైమ్ ఓ డిటెక్టివ్ వెబ్‌సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండటంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగిపోయాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో వికటకవి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్కి రాబోతుంది. ఈ సిరీస్కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
వికటకవి ఓటీటీ::
తాజాగా ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 అధికారిక ప్రకటన చేసింది. ఈ నవంబర్ 28న 'వికటకవి' వెబ్‌సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 పోస్ట్ చేసింది. కాగా ఈ సీరీస్ ఆడియన్స్ ఊహకు అందని ట్విస్ట్‌లతో, తెలంగాణ యాస, భాషలతో సాగనున్నట్లు సమాచారం.
హీరో నరేష్ అగస్త్య జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన సినిమాలతో, వెబ్ సిరీస్ తో దూసుకెళ్తున్నారు. మత్తువదలరా సినిమాలో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌తో యాక్టర్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కిస్మత్, మెన్ టూ, హ్యాపీ బర్త్‌డే, సేనాపతి,పంచతంత్రం, పరువు, కలితో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి అలరిస్తున్నాడు. ఇక ఈ సిరీస్లో డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేష్ అగస్త్య కనిపించనున్నారు.
Also Read : వాళ్ళ కేరింతలే మన సంతోషం
వికటకవి స్టోరీ లైన్:
ఇప్పటికీ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, పీరియాడిక్ జోనర్లో వస్తోన్న థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక స్టోరీ విషయానికి వస్తే..హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని 'అమరగిరి' అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఏదో శక్తి రూపంలో ఉండే ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. దాంతో ఆ గ్రామాల చుట్టూరా ఉన్న ప్రజల్లో ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న భయాన్ని, అక్కడ నెలకొన్న సమస్యను సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరికి వెళతాడు. ఇక తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి అమరగిరి ప్రాంతాన్ని భయపెట్టేది.. కనబడని శక్తి హ ? లేక ముసుగువేసుకున్న మనుషులా? అక్కడ ఉన్న రహస్యాలను వెలికితీసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లేంటీ ? అసలు మేఘ ఆకాష్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. ?
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024
It will see you on screens from 28th November ?#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali ?#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz