Nani New Movies: మలయాళ డైరెక్టర్తో నాని మూవీ.. లైనప్​లో ఎన్ని సినిమాలంటే?

అష్టాచమ్మా మూవీతో సినిమాల్లోకి హీరోగా అడుగుపెట్టిన నాని (Nani) ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ నేమ్ తెచ్చుకున్నాడు.

ఎన్నో హిట్ మూవీస్ను తన కెరీర్లో సొంతం చేసుకు న్నాడు. నాని మూవీ అంటే ఎదో స్పెషల్ మెసేజ్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకునేంతగా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక కొత్త డైరెక్టర్ల ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ నాని ముందుంటారు.

అందులో భాగంగానే శ్రీకాంత్, శౌర్యవ్ అనే ఇద్దరు డైరెక్టర్లను టాలీవుడ్కు పరిచయం చేశాడు. కేవలం తెలుగు డైరెక్టర్లతోనే కాకుండా తమిళ దర్శకులతో కూడా నాని సినిమాలు చేశాడు.

అయితే తాజాగా ఓ మలయాళం దర్శకుడితో నాని సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. జయ జయ జయహే, గురువాయూర్ అంబలనాదయిల్ వంటి సినిమాలను తెరకెక్కించిన విపిన్ దాస్ (Vipin Das)తో నాని మూవీ ఉంటుందని సమాచారం. విపిన్ దాస్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ALSO READ | Maharaja: చైనాలో గ్రాండ్గా రిలీజ్ కానున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ

ఇక నాని వరుస సినిమాల లైనప్ చూస్తే.. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలతో, ఓజి డైరెక్టర్ సుజీత్‌తో .. వీటితో పాటు మరో ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఐదు సినిమాలు లైన్లో ఉంచాడు నాని.