Daaku Maharaaj: డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. బాలయ్య ఊచకోత తప్పదనేలా విజువల్స్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ కొల్లి(Bobby) రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ విజువల్స్ అంచనాలు పెంచాయి.

ఈ నేపథ్యంలో (Dec 13న) ఆ అంచనాలను మరింత పెంచేసేలా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. డాకు రేజ్ లిరికల్ పేరుతో వచ్చిన ఈ వీడియో బ్లాస్ట్ అయ్యేలా ఉంది.

డేగ డేగా అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. నకాష్ అజీజ్ పాడారు. 'మాస్ విధ్వంసం స్పృష్టించేలా.. సౌండ్ వరల్డ్ ఆఫ్ డాకు' అనేలా సాంగ్ బ్లాస్ట్ అయ్యే లక్షణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ట్యూన్ గూస్బంప్స్ తెప్పెంచేలా ఉన్నాయి. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ బాలకృష్ణ అని మరోసారి చెప్పేలా ఉంది. డాకు మహారాజ్లో బాలయ్య ఊచకోత తప్పదనేలా ఫస్ట్ సింగిల్ ప్రోమో చెబుతోంది. 

రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం ఊరమస్గా ఉంది. "ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు.. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది" అంటూ బాలయ్య ఎంట్రీకి సంబంధించిన ఈ పదాలు కథపై ఆసక్తి కలిగిస్తున్నాయి. 

Also Read :- నయనతార, నెట్ఫ్లిక్స్కు కోర్టు నోటీసులు

అలాగే.. 'సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్ ..హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్కు ఫుల్ ఎక్కించేశాడు. మరి సినిమాతో ఎలాంటి కిక్ ఎక్కిస్తాడో చూడాలి. ఈ మూవీలో ‘యానిమల్‌‌‌‌’తో మెప్పించిన బాబీడియోల్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణకు జోడిగా అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారు. 'వాల్తేరు వీరయ్య'తో పాటు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశీ రౌతేలా మరో స్పెషల్ రోల్ చేయనున్నారు.

ఇకపోతే డాకు మహారాజ్ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న థియేటర్స్‌‌‌‌లోకి రాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.