Chaitanya, Sobhita Wedding: రూమర్స్కు.. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు.. జరిగేది అక్కడే!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ 2024 ఆగస్టు 8న గ్రాండ్గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఈ జంట ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. అలాగే పెళ్లి తేదీ, పెళ్లి వేదికపై ఇలా ప్రతి విషయంలో నెటిజన్లు గట్టిగా మాట్లాడుకుంటున్నారు.  

ఎట్టకేలకు వీరి పెళ్లి వేడుకపై ఇవాళ మంగళవారం (నవంబర్ 12న) క్లారిటీ వచ్చేసింది. నాగ చైతన్య - శోభితల వివాహం 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయాలని అక్కినేని నాగార్జున డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్టూడియోలో చేసుకుంటే తాతగారి ఆశీస్సులు కూడా ఉంటాయని చై చెప్పడంతో నాగ్ కూడా ఒకే చెప్పాడట. అయితే వివాహ ముహూర్తం ఉదయమా లేదా సాయంత్రమా అనేది మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

అతి త్వరలో వీరి పెళ్లి విషయాలపై ఇరు కుటుంబాలు అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ అక్కినేని వారి పెళ్లి మొదట వైజాగ్లో జరగనుందని వార్తలు రాగా.. ఇపుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో కానుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణోత్సవానికి స్టూడియో లోపల ప్రత్యేక మండపాన్ని నిర్మిస్తున్నట్లు నాగ్ అన్నట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ జంట ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి (అక్టోబర్ 28న) జరిగిన ANR అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో ఎంతో ఉత్సాహంగా క‌నిపించారు.