Naga Chaitanya: మైథికల్ థ్రిల్లర్తో వస్తున్న నాగ చైతన్య, పూజా హెగ్డే.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్లో బిజిబిజీగా ఉన్న నాగచైతన్య అదే జోష్లో మరో మూవీకి ఓకే చెప్పేశాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

విరూపాక్ష మూవీ ఫేం కార్తీక్ దండు (Karthik Dandu) డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా కన్నడ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) ను తీసుకునే చాన్స్ ఉంది. మూవీని బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి అంజిష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

కాగా గతంలో నాగచైతన్య, పూజాహెగ్దే కలిసి ఓ సినిమాలో నటించారు. 'ఒక లైలా కోసం' మూవీలో వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తర్వాల వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాలేదు.

ALSO READ | Pushpa 2: The Rule : పుష్ప సినిమాని ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కథనంతో రూపొందనున్నఈ మూవీలో పూజాహెగ్దేను హీరోయిన్గా తీసుకుంటే ఫ్యాన్స్కి ఇక పండగే. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే కాకుండా.. సస్పెన్స్ థ్రిల్లర్గా మూవీ రాబోతోంది.

ఇదిలా ఉంటే..నాగ చైతన్యకి వంద కోట్ల హిట్ పడితే చూడాలన్నది అక్కినేని ఫ్యాన్స్ కల. ఎందుకంటే, బంగార్రాజు,లవ్ స్టోరీ చిత్రాలు వచ్చి పర్లేదు అనిపించినా బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకోలే. ఒక మోస్తరు హిట్ కంటే.. హై రేంజ్ హిట్ కావాలంటూ ఫ్యాన్స్ గిరి గీసీ పెట్టుకున్నారు.

డైరెక్టర్ కార్తీక్ దండు విజన్.. విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్..అంటూ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మరి త్వరలో అధికారిక ప్రకటనతో పాటు స్టోరీ ఎలాంటిదో కూడా తెలిసిపోతుంది.