RAPO22: మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని మూవీ.. గ్రాండ్గా పూజా ఈవెంట్

హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి (Mahesh Babu) దర్శకత్వంలో 'రాపో 22' (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. మైత్రి మేకర్స్ రూపొందించనున్న ఈ మూవీ గురువారం (నవంబర్ 21న) హైదరాబాద్లో పూజా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ దర్శకులు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. హను రాఘవపూడి క్లాప్ కొట్టారు. యువ దర్శకులు వెంకీ కుడుముల మొదటి షాట్‌కి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు మైత్రి మేకర్స్. 

రాపో 22 మూవీ విషయానికి వస్తే.. ఇందులో రామ్ సరసన  క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ గురించి హీరో రామ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు.

ALSO READ | Akira Nandan: పవన్ కళ్యాణ్ ఓజీలో అకిరా నందన్?.. వేరే లెవెల్ అప్డేట్ అంతే!

'సమ్‌‌‌‌థింగ్ ఫ్రెష్, న్యూ, అన్‌‌‌‌టోల్డ్ స్టోరీని ఎక్స్‌‌‌‌పీరియెన్స్ చేయడానికి రెడీగా ఉండండి.. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్‌‌‌‌తో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అని ట్యాగ్ ఇచ్చాడు. షేర్ చేసిన ఫొటోలో సైకిల్ నడుపుతూ వెనుక నుంచి కనిపిస్తున్న రామ్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.