Chiranjeevi: నాకు మూడో తమ్ముడు ఇతనే.. ఈ బొమ్మ సూపర్ హిట్ అవ్వాలి: చిరంజీవి

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్స్‌‌. సత్యరాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ‘ఓటీటీలకు జనం అలవాటుపడ్డారు, థియేటర్స్‌‌కు రావడం లేదు అనేది అవాస్తవం. కంటెంట్ బాగుండి, ఎంటర్‌‌‌‌టైన్మెంట్ ఇవ్వగలిగితే ఆ సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

‘జీబ్రా’ కూడా అలాంటి ఓ మంచి కంటెంట్‌‌తో వస్తోంది. ఇందులో చక్కని స్టార్ కాస్ట్ ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో పాటు ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ కూడా ఉందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ బొమ్మ సూపర్ హిట్ అవ్వాలి. ఇక నాకు మరో తమ్ముడు అంటూ ఉంటే అది సత్యదేవ్. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, నిజమైన ఎమోషన్ తనలో కనిపిస్తుంది.

ఒక మంచి యాక్టర్‌‌‌‌కు సరైన సినిమాలు పడటం లేదని అనే ఆలోచనతో ‘గాడ్ ఫాదర్‌‌‌‌’లో పాత్రకు రిఫర్ చేశాను. తనలాంటి వెర్సటైల్ యాక్టర్స్ తెలుగులో కరువయ్యారు. ఇందులో మాస్ హీరోగా, సెటిల్డ్ కామెడీతో చేసిన పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. తనకు ఇంకా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని, తనను మరింత ఎత్తులో చూడాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. దర్శకుడు  ప్రశాంత్ వర్మ, నిర్మాత మైత్రీ రవిశంకర్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి అన్నయ్య ఇచ్చిన ఎంకరేజ్‌‌మెంట్‌‌తోనే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఇది నాకు  డెబ్యూ లాంటిది’ అని చెప్పాడు.  డాలీ ధనంజయ మాట్లాడుతూ ‘ఇది కంప్లీట్ మాస్, ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. ప్రతి ఒక్కరికీ థియేటర్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు. ‘ఇదొక రోలర్ కోస్టల్ రైడ్. ఆడియెన్స్ ఎంగేజ్ చేసేలా ఉంటుంది’ అని దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చెప్పాడు. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుందని చిత్ర నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.