MatkaTrailer: మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్.. చిరు స్టేట్ రౌడీ మాదిరిగా వరుణ్ తేజ్ కుమ్మేసాడు

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar)డైరెక్షన్ లో మట్కా అనే పీరియాడికల్ జోనర్ లో మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్‌, సాంగ్స్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇవాళ శనివారం (నవంబర్ 2న) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతుల మీదుగా మట్కా ట్రైలర్ రిలీజ్ చేశారు. 'సర్కాస్ లో బఫున్లను చూసి జనమంతా నవ్వుతారు.. చప్పట్లు కొడతారు.. కానీ, ఒక చిన్న కర్ర పట్టుకుని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడు ఒకడుంటాడు అలాంటోడే వీడు' అంటూ వరుణ్ తేజ్ ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్పే డైలాగ్ అదిరింది. 'నీ అవసరం ఈ డబ్బు.. ఇది వ్యసనం అయిపోయింది నీకు.. వ్యసనంలో పతనం ఉంటది..' అంటూ హీరోయిన్ మీనాక్షి చౌదరి చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది.

మనం ఆశను నమ్ముతం.. నమ్మకాన్ని కొంటాం'.. 'యేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యని కాదు.. బాసుని .. మట్కా కింగ్ ని' అంటూ హీరో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఇంటెన్స్ పెంచుతున్నాయి. నాలుగు భిన్నమైన షేడ్స్ లో కనిపించిన వరుణ్ తేజ్ కుమ్మేసాడు. వ‌రుణ్ తేజ్ మాస్ మరియు క్లాస్ లుక్స్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నాయి.

చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ మాదిరిగా ట్రైలర్లో వరుణ్ తేజ్ నటన, డైలాగ్ డెలివరీ అదిరింది.  ఇక యాక్షన్ సీన్స్కి తగ్గట్టుగా జివి ప్రకాష్ కుమార్ బీజిఎం అదరగొట్టాడు. దీన్నిబట్టి చూస్తే మట్కా చిత్రంతో వరుణ్ తేజ్ మంచి మ్యాసివ్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఈ మధ్య వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సఫెస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో మట్కా చిత్రంతో హిట్ కొట్టాలని బాగానే శ్రమించాడు. మరి ఈ చిత్రం థియేటర్లో ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 24 ఏళ్ళ టైమ్ పిరియాడ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. 1958-1982 మధ్య జరిగిన యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నరట. కాగా ఈ మూవీలో వరుణ్ తేజ్కు జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), నోరా ఫతేహి(Nora Fatehi) నటిస్తున్నారు. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీను నిర్మించారు. సౌత్‌లో మోస్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ లో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నవంబర్ 14న థియేటర్లలో మట్కా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.