డేంజర్ తప్పదా: ప్రభాస్కు పోటీగా మంచు విష్ణు.. కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్

మంచు విష్ణు లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’(Kannappa). మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌ దర్శక‌‌‌‌త్వం వ‌‌‌‌హిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా నవంబర్ 25న ఈ విషయాన్ని కన్‌‌‌‌ఫర్మ్ చేస్తూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.

"పరమ శివుడి గొప్ప భక్తుడు కన్నప్ప గురించి ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పని కథను చూసేందుకు మీ క్యాలెండర్‌ లో డేట్‌ ను వెంటనే మార్క్ చేసుకోండి. 2025 ఏప్రిల్ 25 వెండితెరపైకి మూవీ రావడానికి సిద్ధంగా ఉంది! ఎపిక్ జర్నీకి సిద్ధంగా ఉండండి!" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. త్రిశూలం ఉన్న పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.

ఈ మూవీలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నాడు. అవా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

అయితే, ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ ప్రకటించినప్పటికీ గట్టి పోటీ తప్పదు. ఎందుకంటే, 2025 ఏప్రిల్ 10న ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ మూవీ రిలీజ్ కానుంది. అలాగే తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ మూవీ కూడా వారంలోపే రిలీజ్ కానుంది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు రిస్క్ చేస్తున్నాడంటూ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.